వాటర్ బాటిల్‌ను తలపించే సీసా.. అందులో ముదురు గోధుమ వర్ణంలో ద్రావణం.. దాన్ని చూస్తే సూపర్ మార్కెట్లలో స్టాండ్స్ మీద కనిపించే నువ్వుల నూనెలా అనిపిస్తుంది. కానీ దాని మీద లోగో చూస్తే మాత్రం షాకవుతాం. ‘స్పై హెచ్డీ విస్కీ’ అని రాసి ఉంది దాని మీద. 750 మిల్లీలీటర్ల పరిమాణం.. అంటే మందు బాబుల లెక్కల్లో ‘ఫుల్’ అన్నమాట. ధర 430 రూపాయలు.
అలాగే ‘ఆంధ్రా గోల్డ్’ పేరుతో మరో విస్కీ బ్రాండు. 180 మిల్లీ లీటర్ల పరిమాణంతో ఉన్న దాని ధర రూ.120. ఇప్పటిదాకా కనీ వినీ ఎరుగని బ్రాండ్లు ఇవి. కేవలం మన ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఇప్పుడు చూస్తున్నాం. ఇలాంటి ఊరూ పేరు లేని బ్రాండ్లు మరెన్నో. నిన్న ఆంధ్రాలో వైన్ షాపులు రీఓపెన్ చేసిన సందర్భంగా కనిపించిన దృశ్యాలివి. ఆ బ్రాండ్లేంటో.. వాటిని ఎక్కడ తయారు చేశారో.. వాటి క్వాలిటీ ఏంటో తెలియక షాక్ తింటుున్నారు జనం.
ఐతే మందు దొరక్క పిచ్చెక్కిపోతున్న వాళ్లకు మాత్రం బ్రాండ్లతో పని లేదు. ఏది దొరికితే అది అన్నట్లుగా కొని తాగేస్తున్నారు. మామూలుగానే మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అందులోనూ ఈ బ్రాండ్ల వ్యవహారం చూస్తే క్వాలిటీ దారుణంగా ఉంటుందని అర్థమవుతోంది. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీలో పేరుమోసిన మద్యం బ్రాండ్లన్నీ పక్కకు వెళ్లిపోయాయి.
బీర్లతో పాటు విస్కీ, బ్రాందీ, రమ్.. ఇలా అన్ని రకాల మద్యాల్లోనూ లోకల్ బ్రాండ్లు వచ్చేశాయి. అధికార పార్టీ నాయకులే తక్కువ ఖర్చుతో మద్యం తయారు చేసి.. వాటికి ఇష్టమొచ్చిన బ్రాండ్ల పేర్లు తగిలించి.. మద్యం దుకాణాల్లోకి తెస్తున్నారని.. వీటి ద్వారా భారీగా ఆదాయం దండుకుంటున్నారని.. వైన్ షాపులకు కూడా కమీషన్ దండిగా వస్తుండటంతో వాళ్లు కూడా వీటినే అమ్ముతున్నారని.. ఐతే వీటితో మందు బాబుల ఆరోగ్యాలు మరింతగా గుల్లవడం ఖాయమని అంటున్నారు. కానీ మద్యపానం అన్నదే హానికరం కావడంతో ఇలాంటి వాటిపై ప్రశ్నించేదెవరు? పోరాడేదెవరు? మందుబాబులు అభ్యంతరం వ్యక్తం చేసినా ఎవరు పట్టించుకుంటారు?
This post was last modified on May 5, 2020 6:03 pm
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…