Political News

జగన్ పాదయాత్ర 2.0 – ఆరోజే ఎందుకు?

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి పాదయాత్ర చేపట్టేందుకు తేదీ ఖరారైందా? ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. వైఎస్సార్‌ జయంతి సందర్భంగా 2027 జులై 8న జగన్‌ పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై వైసీపీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

2027 నుంచి మళ్లీ ప్రజల్లోకి వెళ్లి పాదయాత్ర చేస్తానని జగన్‌ గతంలో పలుమార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 2027 జులై 8న పాదయాత్ర ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు జరుగుతున్న ప్రచారం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

గతంలో వైఎస్‌ జగన్‌ 2017 నవంబరులో పాదయాత్ర ప్రారంభించారు. సుమారు 14 నెలలపాటు సాగిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ 2019 జనవరి 9న ముగిసింది. ఆ తర్వాత జరిగిన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.

ఈ ఏడాది జూన్‌లో జగన్‌ చేసిన వ్యాఖ్యలు పాదయాత్ర ప్రచారానికి మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ‘కన్నుమూసి తెరిచేసరికి రెండేళ్లు గడిచాయి. ఇంకా ఉన్నది మూడేళ్లే. మరో ఒకటిన్నర సంవత్సరం పోతే నా పాదయాత్ర స్టార్ట్‌ అయిపోతది.’ అంటూ జగన్‌ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన చెప్పిన కాల వ్యవధికి అనుగుణంగానే 2027లో పాదయాత్రకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.

అయితే పాదయాత్ర ప్రారంభ తేదీ, మార్గం, కార్యక్రమ వివరాలపై వైసీపీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

This post was last modified on September 4, 2026 11:23 am

Share

Recent Posts

తమన్నా కొత్త సినిమా చూడక్కర్లేదా

మన దగ్గర తెరమీద కనిపించడం మానేసింది కానీ బాలీవుడ్ ఆఫర్లతో మిల్కి బ్యూటీ తమన్నా కెరీర్ దివ్యంగానే ఉంది. సినిమాలు,…

3 hours ago

8 నెలలు వెతికిన విలన్ న్యాయం చేశాడా

తాజాగా విడుదలైన ది ప్యారడైజ్ మీద చర్చలు, ట్రోల్స్, కలెక్షన్ల మీద డిబేట్లు అన్నీ సోషల్ మీడియాలో జరుగుతూనే ఉన్నాయి.…

3 hours ago

సోషల్ మీడియాకి రియాక్ట్ అయితే ఎలా

సెలబ్రిటీలు సోషల్ మీడియాకు స్పందించే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏ మాత్రం టెంప్ట్ అయినా దాని పరిణామాలు అనవసరమైన అపార్థాలకు…

6 hours ago

చైనా అధ్యక్షుడి కోసం ప్రోటోకాల్ బ్రేక్ చేసిన ట్రంప్

దగ్గరదగ్గర పది.. పన్నెండు రోజుల క్రితం ఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో చైనా అధినేత షీ జిన్ పింగ్…

7 hours ago

హౌస్ హాజ్బెండ్… ఇక మామూలే…

మీ ఆవిడ ఏమి చేస్తుంటారు అని ఎవరైనా అడిగితే హౌస్ వైఫ్ అని సమాధానం చెప్పడం ఇప్పటి వరకు మనం…

7 hours ago

నాని సామర్ధ్యం… డౌట్లు అక్కర్లేదు

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ ఊహించని స్థాయిలో అతి పెద్ద ఓపెనింగ్ దక్కించుకుంది. నిర్మాణ సంస్థ అధికారికంగా చెబుతున్న దాని…

7 hours ago