Political News

అధికారులు నాన్ లోకల్… ఎమ్మెల్యే లోకల్

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమం సందర్భంగా అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అలిగి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్య అతిథి అయిన దానం రాకుండానే అధికారులు లక్కీ డ్రా నిర్వహించడంతో అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ఈ రోజు ఆ వ్యవహారంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత బస్తీ ఎమ్మెల్యేల లాగా అధికారులపై దాడి చేస్తేనే వారు మాట వింటారు అంటే అలా చేయడానికి రెడీ అని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.

అంతేకాదు, ప్రభుత్వ అధికారులను కొట్టడం తనకు కొత్తేమీ కాదని, అది తనకు అలవాటేనని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గతంలో ఒక ప్రభుత్వ అధికారిని కొట్టి జైలుకు కూడా పోయానని మీడియా ముందే ఆయన వ్యాఖ్యానించడం విశేషం. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని, లబ్ధిదారుల జాబితాలో తన నియోజకవర్గం వారు కాకుండా బయటివారు ఉన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక, హౌసింగ్‌ బోర్డు ఎండీ గౌతమ్‌ తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఆయన అన్నారు. ఆయన వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తానని, అసెంబ్లీలో కూడా ఈ వ్యవహారం గురించి ప్రస్తావిస్తానని చెప్పారు. రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా అధికారులు ప్రొటోకాల్ పాటించాలని అన్నారు.

అధికారులు వస్తుంటారు పోతుంటారు…దానం నాగేందర్ లోకల్ అంటూ ఇడియట్ లో రవితేజ మాదిరి డైలాగ్ చెప్పారు దానం. ప్రభుత్వంపై అసంతృప్తి లేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించొద్దని స్పష్టం చేశారు. ఎక్కడో కుట్ర జరుగుతోందని, అధికారుల ప్రవర్తన బాగోలేదని, దాని వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని అన్నారు.

This post was last modified on September 1, 2026 7:13 pm

Share

Recent Posts

రాములమ్మని వాడుకోవడం తెలివైన ఐడియా

పాత పాటలను కొత్త సినిమాల కోసం రీమిక్స్ చేసి వాడుకోవడం కొత్త కాదు. దాదాపు అందరు హీరోలు చేశారు. అల్లరి…

59 minutes ago

ఇది వింటే ఇక జన్మలో కాపీ కొట్టరు

పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు సాధారణంగా కఠిన తనిఖీలు, నిఘా కెమెరాలు, ప్రత్యేక బృందాలను ఉపయోగిస్తుంటారు. అయితే దక్షిణ కొరియా అధికారులు…

2 hours ago

ఏఐని గుడ్డిగా నమ్మితే ఇలాగే ఉంటుంది

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తోంది. క్లిష్టమైన పనులను సులభతరం చేస్తూ, వేగంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి…

2 hours ago

ఎట్ట‌కేల‌కు ప‌రిటాల వార‌సుడి సుడి తిరిగింది!

ప‌రిటాల ర‌వి, ప‌రిటాల సునీతల వార‌సుడు, టీడీపీ యువ‌నాయ‌కుడు ప‌రిటాల శ్రీరామ్‌.. తాజాగా జ‌రిగిన జిల్లా ప‌రిష‌త్‌.. చైర్మ‌న్ ఎంపిక‌లో…

2 hours ago

అధికారంలో ఉన్న బీజేపీ కంటే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు

బీజేపీ అడ్డాగా చెప్పుకునే రాష్ట్రాల్లో ఒకటైన రాజస్థాన్ లో స్థానిక ఎన్నికల ఫలితాలు కమలనాధులకు దిమ్మతిరిగేలా వచ్చాయి. ఆ రాష్ట్రంలోని…

2 hours ago

నితిన్ ఇచ్చింది చాలా పెద్ద స్టేట్‌మెంట్

ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ చూసిన నితిన్ ను గత కొన్నేళ్లుగా వరస డిజాస్టర్లు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కొత్త వాళ్లకు…

2 hours ago