Movie News

నిజమా… శ్రీకృష్ణుడి పాత్రలో రామ్‌ చరణ్ ?

ఆర్ఆర్ఆర్ అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ ని చూశాక అభిమానులతో పాటు ఎక్కువగా నార్త్ ఇండియా ఫ్యాన్స్ ఫీలయ్యింది ఒకటే. రాముడు లాంటి పాత్రకు తను బాగా సరిపోతాడని, ఆ దిశగా ఎవరైనా ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని. తక్కువ నిడివే అయినా వారణాసిలో మహేష్ బాబుని రాజమౌళి ఆల్రెడీ అలా చూపించేస్తున్నారు కాబట్టి చరణ్ లాంటి హీరోలకు వేరేవి డిజైన్ చేయాలి. ముంబై టాక్ కనక నిజమైతే త్వరలో మెగా పవర్ స్టార్ ని కృష్ణుడిగా చూడొచ్చు.

వివరాల్లోకి వెళ్తే గత ఏడాది గుజరాతిలో విడుదలైన ‘లాలో – కృష్ణ సదా సహాయతే’ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. కేవలం యాభై లక్షల బడ్జెట్ తో తీస్తే వంద కోట్లకు పైగా వసూలు చేయడం ఒక చరిత్ర. అదే మన దక్షిణాదిలో అయితే అంత బడ్జెట్ తో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేం. దీన్ని తెలుగులో రీమేక్ చేసే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయని సమాచారం. కీలకమైన శ్రీకృష్ణుడి పాత్రకు రామ్‌చరణ్ ని ఒప్పించే దిశగా దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారనేది ఈ వార్తల సారాంశం.

అంతగా ఇందులో ఏముందంటే లాలో అనే ఆటో డ్రైవర్ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో గొడవ పడి నానా రకాల వ్యసనాలు, ఇబ్బందులతో బాధ పడుతూ ఒక నిర్మానుష ప్రదేశంలో తల దాచుకుంటాడు. అప్పుడు మనిషి రూపంలో వచ్చిన కృష్ణుడు లాలోతో స్నేహం చేసి అతని జీవితాన్ని మారుస్తాడు. ఇక్కడ సింపుల్ గా చెప్పినా కథా కథనాల్లో చాలా డెప్త్ ఉండేలా తీశారు దర్శకుడు అంకిత్ సకియా. ఎమోషన్స్ బాగా పండటం వల్ల మూవీ సక్సెసయ్యింది.

ఇదంతా చదివి గోపాల గోపాలలో పవన్ కళ్యాణ్ గుర్తుకు వస్తే అందులో ఆశ్చర్యం లేదు. కాకపోతే పోలిక ఒకటే అలా అనిపిస్తుంది కానీ రెండు స్టోరీలు పూర్తిగా సంబంధం లేకుండా ఉంటాయి. దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ ఉండే అవకాశాలను టీమ్ పరిశీలిస్తోందట. అయితే చరణ్ నిజంగా ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్లకు ఎస్ చెబుతాడా లేక తిరస్కరిస్తాడానేది వేచి చూస్తే కాని క్లారిటీ రాదు. పెద్ది తర్వాత అయిదు నెలలు రెస్ట్ తీసుకున్న చరణ్ సుకుమార్ దర్శకత్వంలో త్వరలో ఆర్సి 17కి రెడీ అవుతున్నాడు. 

This post was last modified on September 1, 2026 4:42 pm

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

31 minutes ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

59 minutes ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

2 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

9 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

12 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

12 hours ago