Political News

సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్

సినీ తారలు, సెలబ్రిటీలు, వీఐపీలు, అధికారులు క్రికెట్ మ్యాచ్ లు ఆడుతున్న సందర్భంలో వారిలో కొంతమంది ప్రొఫెషనల్ క్రికెటర్లకు ఏ మాత్రం తీసిపోరు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో రాణిస్తూ ఔరా అనిపించిన వారు చాలామంది ఉన్నారు. తాజాగా ఆ జాబితాలోకి తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ చేరారు. హెచ్ సీఏ సి-డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో సీవీ ఆనంద్ సెంచరీతో చెలరేగారు.

58 సంవత్సరాల వయసులో సీవీ ఆనంద్ దూకుడు చూసిన నెటిజన్లు షాకయ్యారు. 82 బంతుల్లో 21 ఫోర్లు, 5 సిక్సర్లతో బౌలర్లకు చుక్కలు చూపించారు. సికింద్రాబాద్ క్లబ్ తరఫున ఓపెనర్ గా బరిలోకి దిగిన ఆనంద్ హైదరాబాద్ జట్టుపై సెంచరీ బాదారు.

బౌలర్లపై బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డ ఆనంద్ అజేయంగా 126 పరుగులు చేశారు. అంతేకాదు, 5 ఓవర్లు బౌలింగ్ వేసి 8 పరుగులు మాత్రమే ఇచ్చి ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను కట్టడి చేశారు. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్, ఫీల్డింగ్ లో రాణించి ఆల్ రౌండ్ ప్రతిభతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఆనంద్ విధ్వంసకర ఇన్నింగ్స్ వల్ల సికింద్రాబాద్ క్లబ్ జట్టు 39 ఓవర్లలో 7 వికెట్లకు 328 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆనంద్ సెంచరీకి తోడు జంషీద్‌ (77), సంజీవ్‌ రెడ్డి (40) రాణించారు. భారీ లక్ష్య ఛేదనలో హైదరాబాద్‌ జట్టు 21.1 ఓవర్లలో 72/3 పరుగుల వద్ద ఉండగా వర్షం అంతరాయం కల్గించింది. దీంతో, వీజేడీ పద్ధతిలో సికింద్రాబాద్‌ను విజేతగా ప్రకటించారు. విద్యార్థిగా ఉన్న సమయంలో సీవీ ఆనంద్ ప్రొఫెషనల్ క్రికెట్ ప్లేయర్. సికింద్రాబాద్ క్లబ్ తరఫున ఆయన 5 సెంచరీలు బాదారు. అండర్-22 క్రికెట్ లో ఆయన సత్తా చాటారు. ఆ తర్వాత ఐఏఎస్ చదివేందుకు క్రికెట్ ను పక్కనబెట్టారు.

This post was last modified on August 31, 2026 2:52 pm

Share

Recent Posts

నాన్న, అమ్మ, కొడుకు.. ఇప్పుడు కూతురు కూడా

సినిమా కుటుంబాల నుంచి వారసులు ఇండస్ట్రీలోకి రావడం చాలా మామూలు విషయం. ఐతే ఒక కుటుంబంలో తండ్రి హీరోగా, తల్లి…

50 minutes ago

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

10 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

12 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

12 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

12 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

16 hours ago