Political News

సజ్జలపై సంచలన ఆరోపణలు చేసిన సాయిరెడ్డి

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తన ఆక్రోశాన్ని, ఆవేదనను వెళ్లగక్కారు. తనకు రాజకీయ పునాదులు వేసిన వైసిపి పార్టీలో జరిగిన అవమానంపై ఒక బహిరంగ లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి వైసీపీ నుంచి బయటకు వచ్చి వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పిన విజయసాయిరెడ్డి ఈ మధ్యకాలంలో తాను ఒక రాజకీయ పార్టీని పెడతానంటూ ప్రకటించారు. అప్పుడప్పుడు కొన్ని ట్వీట్లు కూడా చేస్తున్నారు. రాజకీయ పరిణామాలపై స్పందిస్తున్నారు. దీనికి వైసిపి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో విజయసాయి ఒక బహిరంగ లేఖ రాశారు.. అందులో ఈ విధంగా ఆరోపణలు చేశారు.

వైసీపీకి చెందిన ‘కోటరీ’ తనను ‘నమ్మక ద్రోహి’గా చిత్రీకరిస్తూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. తాను నమ్మక ద్రోహినే అయితే అప్పట్లోనే కాంగ్రెస్‌తో సంధి చేసుకుని సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లలో తన పేరు లేకుండా చేసుకునేవాడినన్నారు. జగన్‌కు నమ్మకస్తుడిగా ఉన్నందుకే ఆయనతో పాటు తనను పలు కేసుల్లో ఏ-2గా చేర్చారని, జగన్‌ 16 నెలలు జైలులో ఉంటే తాను 15 నెలలు జైలులో ఉన్నానని పేర్కొన్నారు. 2024 ఎన్నికల తర్వాత లిక్కర్‌ స్కామ్‌లో ఏ-5గా, కాకినాడ సీపోర్టు కేసులో ఏ-2గా చేర్చారని ఆరోపించారు. 2020 నుంచే తనపై కుట్ర జరిగిందని, ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేశారని తెలిపారు.

 2019 తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం పార్టీలో శ్రుతిమించిందని, జగన్‌ను ఎవరూ కలవకుండా గోడ కట్టారని ఆరోపించారు. సజ్జల ఆధ్వర్యంలో పనిచేయడం తన ఆత్మగౌరవానికి విరుద్ధమని, అందుకే రాజ్యసభ పదవికి, వైసీపీకి రాజీనామా చేశానన్నారు. తనపై జరిగిన అవమానాలు 74 ఉన్నాయని, 2022 మంగళగిరి ప్లీనరీలో సజ్జల తనపై భౌతికంగా దాడి చేశారని ఆరోపించారు. ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నానని, తాను జగన్‌కు నమ్మక ద్రోహం చేయలేదని స్పష్టం చేశారు.

This post was last modified on August 29, 2026 3:13 pm

Share

Recent Posts

దసరా క్లాష్…..సీనియర్ VS జూనియర్

వాయిదాల పుకార్లు ఎన్ని తిరుగుతున్నా మా పని మాదే అన్న తరహాలో దసరా విడుదలని టార్గెట్ చేసుకున్న రెండు ప్యాన్…

5 minutes ago

ఒక్క విషయంలో ఇరుముడికి అపోజిషన్

ఒక తెలుగు సినిమా పాతిక రోజులకు పైగా స్ట్రాంగ్ రన్ చూసి ఎంత కాలమయ్యిందంటే వెంటనే సమాధానం చెప్పడం కష్టం.…

1 hour ago

ఆ ఒక్క ఫోటో ఆమె కేరీర్ ను దెబ్బతీసింది

సెలబ్రిటీల జీవితం పైకి ఎంత ఆకర్షణగా కనిపిస్తుందో లోపల అంత ఘర్షణ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువగా…

2 hours ago

బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు….

బీజేపీతో ప్రతిపక్ష బీఆర్ఎస్ లోపాయికారీగా పొత్తు పెట్టుకుందని అధికార కాంగ్రెస్ పార్టీ తరచుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి…

2 hours ago

ప్యారడైజ్.. మామూలు టాక్ సరిపోదు

నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…

4 hours ago

హైదరాబాద్ బెస్ట్ సింగిల్ స్క్రీన్ రెడీ

థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…

5 hours ago