Movie News

మాస్ బ్యాటింగ్.. ఇక్కడ ఇరుముడి… అక్కడ అది

గత మూడు నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ మంచి జోష్ మీద నడుస్తోంది. కనీసం రెండు వారాలకో మంచి సినిమా పడుతోంది. భారీ వసూళ్లు వస్తున్నాయి. ఐతే ఇప్పటిదాకా వచ్చిన సినిమాలు వేరు. గత వారం వచ్చిన ‘ఇరుముడి’ వేరు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదట్నుంచి మాస్ బ్యాటింగే చేస్తోంది. అందరి అంచనాలను మించిపోయి వసూళ్లు రాబడుతోంది. వీకెండ్లోనే ఊహించని స్థాయికి వెళ్లిపోయిన ఈ చిత్రం.. వీక్ డేస్‌లో కూడా ఏమీ వీకవ్వలేదు.

ఆదివారంతో పోలిస్తే కలెక్షన్లు 20 శాతం లోపే డ్రాప్ అయ్యాయి. మధ్యలో ‘టాక్సిక్’ రాకతో స్క్రీన్లు తగ్గి, పోటీ పెరిగి ఒకట్రెండు రోజులు ఈ సినిమా వసూళ్లు తగ్గాయి. కానీ వీకెండ్ వచ్చేసరికి మళ్లీ సినిమా ఊపందుకుంది. ఈ వారాంతంలో కొత్త సినిమాలా వసూళ్ల మోత మోగిస్తోంది. శని, ఆదివారాల్లో కోరుకున్న థియేటర్లో ‘ఇరుముడి’ చూడాలంటే కష్టపడాల్సిందే.
తెలుగులో ‘ఇరుముడి’ ఇలా వసూళ్ల మోత మోగిస్తుంటే.. మలయాళంలో ఓ సినిమా ఇలాగే మాస్ బ్యాటింగ్ చేస్తోంది. ఆ చిత్రమే.. బెత్లెహాం కుడుంబ యూనిట్.

గత ఏడాది ‘సర్వం మాయ’ చిత్రంతో ఫామ్ అందుకున్న నివిన్ పౌలీ.. గత వారం ‘బెత్లెహాం కుడుంబ యూనిట్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ‘సర్వం మాయ’ లాగే ఇది కూడా ప్లెజెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం.. నివిన్ పౌలీకి తోడు మామిత బైజు రూపంలో జనాలను థియేటర్లకు రప్పించే ఆర్టిస్టులుండడంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. ‘ఇరుముడి’ లాగే రెండో వీకెండ్లోనూ ‘బెత్లెహాం కుడుంబ యూనిట్’ కొత్త చిత్రంలా వసూళ్లు సాధిస్తోంది.

ఇండియాలోనే కాక విదేశాల్లోనూ ఈ సినిమా ఇరగాడేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.130 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. రెండో వీకెండ్ అయ్యేసరికి రూ.150 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టబోతోంది. మలయాళ చిత్రాలకు లాంగ్ రన్ ఉంటుంది కాబట్టి.. ఫుల్ రన్లో రూ.200 కోట్ల క్లబ్బులోనూ ‘బెత్లెహాం కుటుంబ యూనిట్’ అడుగుపెట్టడం లాంఛనమే. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో ఘనవిజయాన్నందుకున్న వారానికే మామితకు ఈ సినిమా రూపంలో ఇంకా బ్లాక్ బస్టర్ ఖాతాలో పడడం విశేషం. మామితకు మంచి గుర్తింపు తెచ్చిన ‘ప్రేమలు’ సినిమా తీసిన గిరీష్ ఏడీనే ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేశాడు.

This post was last modified on August 29, 2026 3:02 pm

Share

Recent Posts

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

2 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

3 hours ago

గంప నిండా సినిమాలు… ఎక్కడయ్యా జనాలు

ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…

3 hours ago

జనాలు పట్టేశాక నిజాలు ఒప్పుకుంటే ఎలా?

ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…

3 hours ago

త్రివిక్రమ్ బాధ్యత గురించి భేతాళ ప్రశ్న

నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం…

4 hours ago

రియాలిటీకి దగ్గరగా ఉన్నా కామెంట్స్ తప్పలేదు

నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…

4 hours ago