Political News

టీడీపీకి ఓట్ల `ప్రాజెక్టులు`… త‌మ్ముళ్లు హ్యాపీ.. !

కీల‌క‌మైన రెండు సాగు, తాగునీటి ప్రాజెక్టుల‌కు సీఎం చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. నిజానికి ఇవి ఏళ్ల త‌ర‌బ‌డి సాగుతున్న ప్రాజెక్టుల‌నే చెప్పాలి. అయితే.. ఈ ప్రాజెక్టుల తొలిద‌శ‌ను పూర్తి చేయ‌డంతోపాటు.. ఈ ఏడాది ఒక ప్రాజెక్టును.. వ‌చ్చే ఏడాది మ‌రోప్రాజెక్టును ప్రారంభించేందుకు చంద్ర‌బాబు పూర్తి స్థాయిలో రెడీ అయ్యారు. ఇది ఆ పార్టీకి ఎంతో మేలు చేస్తుంద‌న్న అంచ‌నాలు వేస్తున్నారు. 1) వెలిగొండ తొలిద‌శ‌. 2) పోల‌వ‌రం తొలిద‌శ‌. ఈ రెండు కూడా కీల‌క‌మైన నాలుగు జిల్లాల‌పైనా.. 40 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌పైనా ప్ర‌భావం చూప‌నున్నాయ‌ని అంటున్నారు.

వెలిగొండ‌: ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని కీల‌క‌మైన వెలిగొండ ప్రాజెక్టు.. ఏకంగా 17 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో ప్ర‌భావం చూప‌నుంది. ప్ర‌త్య‌క్షంగానే కాకుండా.. వెలిగొండ ప్రాజెక్టు కార‌ణంగా ప‌రోక్షంగా కూడా టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వానికి మేలు చేయ‌నుంది. ఈ ప్రాజెక్టు తొలి ద‌శ‌ను ఈ నెల 31న చంద్ర‌బాబు ప్రారంభించ‌నున్నారు. త‌ద్వారా మార్కాపురం జిల్లా వ్యాప్తంగా ఓటు బ్యాంకు టీడీపీ ఖాతాలోకి చేర‌నుంద‌ని అంటున్నారు. ఇక‌, ఈ ప్రాజెక్టుపై ఆధార‌పడిన ఉమ్మ‌డి ప్ర‌కాశం.. నెల్లూరు జిల్లాల‌లోని నియోజ‌క‌వ‌ర్గాలు కూడా ప్ర‌భావితం కానున్నాయి.

పోల‌వ‌రం: ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని పోల‌వ‌రం ప్రాజెక్టుకు కొన్ని ద‌శాబ్దాల చ‌రిత్ర ఉంది. అనేక ఇబ్బందులు స‌వాళ్లు ఎదుర్కొని వ‌చ్చే ఏడాది జూలై నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించారు. వ‌చ్చే ఏడాది గోదావ‌రి పుష్క‌రాల స‌మ‌యానికి పోల‌వ‌రంతొలి ద‌శ‌ను పూర్తి చేయ‌నున్నారు. దీనిని ప్ర‌ధాని మోడీతోనే ప్రారంభించాల‌న్న ప్లాన్ కూడా చేశారు. ఇక‌, ఈ ప్రాజెక్టుతో ఉమ్మ‌డి ప‌శ్చిమ నుంచి శ్రీకాకుళం వ‌ర‌కు.. ఇటు కృష్ణా జిల్లా వ‌ర‌కు కూడా ఓటు బ్యాంకు తీవ్రంగా ప్ర‌భావితం కానుంది. సో.. ఈ రెండు ప్రాజెక్టులు కూడా ప్ర‌జ‌ల‌కు సాగు, తాగు నీరు అందిస్తే.. టీడీపీ కూట‌మికి ఓటు బ్యాంకు అందించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

ఇక‌.. ఇత‌ర ప్రాజెక్టుల విష‌యానికి వ‌స్తే.. అమ‌రావ‌తి రాజ‌ధాని టీడీపీకి పెద్ద ఎస్సెర్ట్‌గా మార‌నుంద‌న్న‌ది ఖాయంగా క‌నిపిస్తోంది. అలానే.. విశాఖ‌లో డేటా కేంద్రం, ఆర్సెలార్ మిట్ట‌ల్ కంపెనీలు.. కూడా కూట‌మి స‌ర్కారుకు ద‌న్నుగా మార‌నున్నాయి. సీమ‌లో ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం, ఉద్యాన పంట‌ల ప్రోత్సాహం.. పెట్టుబ‌డులు.. సౌర విద్యుత్ రంగం డెవ‌ల‌ప్ మెంట్ వంటి ప్రాజెక్టులు కూడా కూట‌మి స‌ర్కారు పెద్ద ఎత్తున ఓట్ల‌ను దూసి పెడ‌తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇదే జ‌రిగితే.. కూట‌మి రెండో సారి అప్ర‌తిహ‌త విజ‌యాన్ని న‌మోదు చేయ‌డం ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

This post was last modified on August 27, 2026 7:28 pm

Share

Recent Posts

గుంత కనిపిస్తే AI చూసుకుంటుంది

రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వరకు చాలామంది చేస్తుంటారు. కానీ ఆ గుంతను బాగు…

18 minutes ago

ప్రభాస్ ఫ్యాన్స్ అయోమయం తీర్చాల్సిందే

ఫౌజీ వాయిదా పడింది. సంతోషం. ఇలాంటి పోస్టుపోన్లు చూడటం కొత్తేమి కాదు కాబట్టి అందులో ఫీలవ్వడానికి ఏం లేదు. మరి…

56 minutes ago

రోడ్డుపై పడుకొని ప్రియాంకా గాంధీ నిరసన

ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో వివాదాల నేపథ్యంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్…

1 hour ago

ఫుట్ పాత్ లపై ట్రాన్స్ ఫార్మర్లేంది స్వామీ?

మన దేశంలో పాదచారుల కోసం రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ ల మీద బడ్డీ కొట్లు మొదలు...జ్యూస్…

2 hours ago

రేవంత్ ఫాంహౌస్ పాచిక పెద్దదే

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ను నిశితంగా చూస్తే..ఆయనలో తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పని చేసిన అధినేతల నీడలు కొట్టొచ్చినట్లు…

2 hours ago

శివన్న ‘బెయిల్’కి ప్రేమ దెబ్బ పడింది

జైలర్ తో శివరాజ్ కుమార్ మనకూ దగ్గరయ్యారు. పెద్దిలో రామ్ చరణ్ గురువుగా నటించి దానికీ ప్లస్ అయ్యారు. గౌతమీపుత్ర…

3 hours ago