మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని నేరుగా ప్రభుత్వమే నిర్వహించిందనేది ప్రధాన ఆరోపణ. నాశి రకం బ్రాండ్లతో వేల కోట్లు కొల్లగొట్టిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఈ నాశిరకం మద్యం కూడా ఒక కారణమని విశ్లేషణలు జరిగాయంటే జగన్ పాలనలో మద్యం విషయంలో ఎంత వ్యతిరేకత వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిట్ విచారణకు ఆదేశించి లిక్కర్ దొంగల కూపీ లాగింది. వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఆధారాలు లభించాయి. ఇప్పటికే ఈ కేసులో అనేకమందిని అరెస్టు చేశారు. ఇపుడు మాజీ మంత్రి వంతు వచ్చింది. ఆయన కూడా జైలుకు పోయాడు. ఈ విషయం మీద వైసీపీ హయాంలో పెనమలూరు ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఈ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న కొలుసు పార్థ సారధి చేసిన విమర్శలు వేడి పుట్టిస్తున్నాయి. జగన్ వద్ద ఎమ్మెల్యేగా చేసినందున ఆయన చేసిన విమర్శలపై జనం చర్చించుకుంటున్నారు.
జగన్ ప్రభుత్వ హయాంలో 3500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగిందని, మద్యం తయారీ, రవాణా, హాలో గ్రామ్ వ్యవహారాల్లో వేల కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. మద్యంలో అక్రమంగా సంపాదించిన డబ్బులను విదేశాలకు తరలించి, అక్కడ రియల్ ఎస్టేట్, మైనింగ్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారని తీవ్రమైన ఆరోపణలు చేశారు.
అంతకుముందు 13 రూపాయలుగా వున్న రవాణా చార్జీలను 35 రూపాయలకు పెంచి తద్వారా 400 కోట్లను దిగమింగారని చెప్పారు. లిక్కర్ లో అవినీతి గురించి కారుమూరి కుమారుడే వెల్లగక్కాడని, అతడు ఇచ్చిన ఆధారాలతోనే కారుమూరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆధారాలు ఉండటం వల్లే ఆయనకు కోర్టులు స్టే ఇవ్వలేదని గుర్తు చేశారు.
లిక్కర్ కేసులో మాజీ మంత్రిని అరెస్టు చేశారు సరే మాజీ ముఖ్యమంత్రిని ఎప్పుడు అరెస్టు చేస్తారని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. కేసు కీలక దశకు చేరుకుందని, ఇక అరెస్ట్ ఒక్కటే మిగిలిందని టీడీపీ ఐటీ సెల్ చెబుతుంది. 2027 లో జగన్ పాదయాత్రకు ముందే అరెస్టు జరుగుతుందని పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరగడం ఖాయమని ఫ్యాన్ ఫ్యాన్స్ హైరానా పడిపోతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates