భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మేలు చేకూరే విధంగా 13 కోట్ల ఓట్లు తొలగించారని తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్ఞానేష్ కుమార్ ను అరెస్టు చేయాలని కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, సీజెపి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ జ్ఞానేష్ కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపట్టింది. ముంబై శివాజీ పార్క్ లో సీజెపి ఆందోళన చేస్తోంది. అయినా సరే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం జ్ఞానేష్ కు గుడ్డిగా కాపు కాస్తుంది.
ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో జ్ఞానేష్ వ్యవహారంలో తాడో పేడో తేల్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దమయ్యింది. ఇందులో భాగంగా జ్ఞానేష్ మీద వున్న పాత కేసుల్ని బయటకు తీసింది. దీంతో ఢిల్లీ రాజకీయాలు మరింత తీవ్ర దశకు చేరుకున్నాయి. అధికార బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్ కూటముల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీన్ని దేశంలోని సామాన్య ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇంతకూ ఏమైందంటే…
1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి జ్ఞానేష్ కుమార్ 2006లో కేరళ ప్రభుత్వంలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూ ) సెక్రటరీగా పనిచేసిన విషయం తెలిసిందే కదా. ఆయన హయాంలో పీడబ్ల్యూ శాఖలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. విపక్షాలే కాకుండా కాగ్ రిపోర్ట్ కూడా ఆయనను తప్పు పట్టింది. కేరళ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్ రోడ్డు పనుల నిధుల మళ్లింపు, కాంట్రాక్టు నిబంధనల మార్పు ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు 92 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక ఇచ్చింది.
ఇపుడీ విషయాన్ని కేరళం కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ బయటకు తీసింది. కేరళం పీసీసీ అధ్యక్షులు మలయంకీజు వేణుగోపాల్ ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన కేరళం హోంమంత్రి రమేష్ చెన్నితల విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో విచారణకు ఆదేశించారు. నిజానికి సీఈసీగా జ్ఞానేష్ కుమార్ ను నియమించినప్పుడే ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అపుడు దాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన జ్ఞానేష్ కుమార్ మాత్రం విచ్చలవిడిగా ఎన్నికల అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కున్నారు. అధికారికంగా ఎన్నికల రిగ్గింగ్ కు పాల్పడినట్లు కాంగ్రెస్, సీజెపి ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన మీద వున్న కేసులను బయటకు తీయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.
కేరళ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్ రోడ్డు ప్రాజెక్టు కేసులో మరో ట్విస్ట్ కూడా వుంది. కేఎస్టీపీ ప్రాజెక్టు పనుల్లో భాగంగా మలేషియాకు చెందిన సివిల్ ఇంజనీర్ లీ సీ బీన్ అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ నోట్లో అప్పటి పీడబ్ల్యూడీ సెక్రటరీ జ్ఞానేష్ కుమార్ పేరు కూడా ప్రస్తావించారు. నిధుల విడుదల కోసం జ్ఞానేష్ కుమార్ లంచం డిమాండ్ చేశారని, మానసికంగా వేధించారని ఆరోపిస్తూ లీ సీ బీన్ తన భార్యతో పాటుగా కంపెనీ డైరెక్టర్‌కు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. దీన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విచారించే అవకాశం వుందని వార్తలు వస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates