Political News

ఆది నుంచీ.. `కొండా ఫ్యామిలీ` పార్టీల‌కు గుదిబండే!

ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్ర‌తిపార్టీలోనూ ఇబ్బందులు వ‌స్తే.. ప్ర‌తిపార్టీపైనా స‌ద‌రు నేత‌లు నిప్పులు చెరిగితే?!… ఎవ‌రిది త‌ప్పు? అనేది తేల్చ‌డం పెద్ద క‌ష్టం కాదు. ఇప్పుడు తెలంగాణ మంత్రి కొండా సురేఖ విష‌యం కూడా అలానే ఉంది. ఆమె ఇప్ప‌టికి ముచ్చ‌ట‌గా మూడు పార్టీలు మారారు. అంతేకాదు.. ఒకానొక ద‌శ‌లో సొంత కుంప‌టి పెట్టుకునే ప్ర‌య‌త్నం కూడా చేశారు.

చిత్రం ఏంటంటే.. కొండా ఫ్యామిలీ ఏ పార్టీలో ఉన్నా.. ఆ చెట్టు కొమ్మ‌ల‌నే న‌రుకుతార‌నే కామెంట్లు విని పించ‌డం. నిత్య అసంతృప్తులుగా కొండా కుటుంబానికి పేరుండ‌డం గ‌మ‌నార్హం. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన కొండా కుటుంబం ప్ర‌స్తుతం .. రాజ‌కీయ చిక్కుల్లో ఉంది. కొండా సురేఖ మంత్రిగా ఉన్న‌ప్ప‌టికీ.. ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు కుటుంబానికి పెను శాపంగా మారాయి. ఫ‌లితంగా మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పిస్తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో కొండా ఫ్యామిలీ రాజ‌కీయాల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఆదిలో కొండా ముర‌ళి.. మావో యిస్టు సానుకూల పార్టీల‌కు.. మ‌ద్ద‌తు తెలిపారు. ఆ త‌ర్వాత‌.. కాంగ్రెస్‌లో చేరారు. ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇదే జిల్లాలో అప్ప‌టి టీడీపీ నేత‌లకు చెక్ పెట్టే క్ర‌మంలో కొండా ఫ్యామిలీకి భారీ అవ‌కాశాలు క‌ల్పించారు. ఇలా.. 2009లో సురేఖ మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కించుకున్నారు.

వైఎస్ మ‌ర‌ణాంత‌రం.. రోశ‌య్య సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టాక‌.. సొంత ప్ర‌భుత్వంపైనే మంత్రిగా ఆమె విమ‌ర్శ‌లు చేశారు. అప్ప‌ట్లో జ‌గ‌న్‌కు అనుకూలంగా త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి.. బ‌య‌ట‌కు వ‌చ్చారు. వైసీపీలో చేరారు. కొన్నాళ్ల‌కు ఇక్క‌డ కూడా అసంతృప్తి జ్వాల‌లు రేగాయి. జ‌గ‌న్ త‌మ‌కు అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌ని.. ప్రాధాన్యం లేకుండా పోయింద‌ని ఆరోపిస్తూ.. బ‌య‌ట‌కు వ‌చ్చి.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే.. ఇక్క‌డ కూడా కొండా కుటుంబం ఎక్కువ కాలం మ‌న‌లేక పోయింది.

బీఆర్ ఎస్ అదినేత కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ త‌ర్వాత రేవంత్ రెడ్డి స‌మక్షంలోనే తిరిగి కాంగ్రెస్‌లోకి వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే ఈ కుటుంబానికి మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. అయితే.. రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన క‌డియం శ్రీహ‌రి(కొండా కుటుంబానికి సుదీర్ఘ వైరం ఉన్న నాయ‌కుడు)ని కాంగ్రెస్‌లో చేర్చుకోవ‌డం(అన‌ధికారికంగా) ఈ కుటుంబానికి న‌చ్చ‌లేదు.

దీంతో అప్ప‌టి నుంచి పార్టీపైనా.. నాయ‌కుల‌పైనా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్‌నే త‌ప్పుబ‌ట్టే ప‌రిస్థితి వ‌చ్చింది. మొత్తంగా కొండా ఫ్యామిలీ ఏ రాజ‌కీయ పార్టీలో ఉన్నా.. ఒకే త‌ర‌హా వైఖ‌రిని ప్ర‌ద‌ర్శించ‌డం.. పార్టీల‌కు ఇబ్బందులు తీసుకురావ‌డం కామ‌న్ అయిపోయింద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. 

This post was last modified on August 24, 2026 6:27 pm

Share

Recent Posts

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

10 minutes ago

డ్రాగన్ ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలి

ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…

26 minutes ago

సెటైర్లు సీరియస్‌గా తీసుకోనవసరం లేదు

నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…

3 hours ago

డబ్బింగ్ సినిమాల రేట్ల పెంపు సబబేనా

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…

3 hours ago

మార్చాల్సింది జ్ఞానేష్‌నా.. వ్య‌వ‌స్థ‌నా?!

ఒక ఇంట్లో దొంగ ప‌డ్డాడు. న‌గ‌లు, నట్రా దోచుకున్నాడు. య‌జ‌మాని ... ఆ దొంగ‌ను గుర్తించాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.…

5 hours ago

బుమ్రా, పాండ్యా లేకుంటే అంతేనా…

టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…

6 hours ago