Movie News

ఎల్లమ్మ… దేవి vs ప్రసాద్

‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత వేణు చేస్తున్న సినిమా కావడంతో ముందే మంచి ఫోకస్ వచ్చింది. పైగా డీఎస్పీ మొదటిసారి పూర్తి స్థాయి హీరోగా వస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ మీద మరో రకమైన అంచనాలు కూడా ఉన్నాయి. కానీ రిలీజ్ దగ్గరికి వచ్చాక ఇక్కడ ఒక పోటీ మొదలవ్వొచ్చు.

అదే ‘దేవి’ vs ‘ప్రసాద్’. డీఎస్పీకి సినిమా మ్యూజిక్‌లో మొదటి అడుగు ‘దేవి’తోనే పడింది. 1999లో వచ్చిన ఆ సినిమాతోనే ఆయన ఫిల్మ్ కంపోజర్‌గా పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి ‘దేవి శ్రీ ప్రసాద్’ అనే పేరు సంగీతంతోనే పెరిగింది. ఇప్పుడు ‘ఎల్లమ్మ’లో మాత్రం మొదటిసారి ‘ప్రసాద్’ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడనుకోవచ్చు. 

మ్యూజిక్ విషయంలో డీఎస్పీకి కొత్తగా నిరూపించుకోవాల్సింది పెద్దగా ఏమీ లేదు. కానీ తనే హీరోగా చేస్తున్న సినిమా కాబట్టి పాటలు, నేపథ్య సంగీతం దగ్గర ఇంకాస్త ఎక్కువగా కష్టపడే అవకాశం ఉండొచ్చు. పైగా ‘ఎల్లమ్మ’ గ్రామీణ కథ. జాతరలు, ఫోక్ టచ్, పర్షి అనే కళాకారుడి పాత్ర.. ఇవన్నీ డీఎస్పీకి మ్యూజిక్ పరంగా మంచి స్పేస్ ఇస్తాయి.

అసలు చాలెంజ్ మాత్రం నటన దగ్గరే. ఎన్నో సినిమాలకు మ్యూజిక్ చేస్తూ సెట్స్‌లో ఉన్న అనుభవం ఒకటి. కెమెరా ముందు పూర్తి సినిమా మోయడం ఇంకొకటి. డైలాగ్ చెప్పడం, ఎమోషన్ చూపించడం, పాత్రలో సహజంగా కనిపించడం.. ఇవన్నీ మొదటిసారి అంచనాలకు తగ్గట్లుగా చేయడం చిన్న విషయం కాదు. పైగా పర్షి పాత్ర రెగ్యులర్ కమర్షియల్ హీరోలా కనిపించడం లేదు.

వేణు యెల్దండికి ఇక్కడ పెద్ద పని అదే. ‘బలగం’లో నటుల నుంచి సహజమైన నటన తీసుకున్నాడు. ఇప్పుడు డీఎస్పీలో ఉన్న హీరోను కూడా అలానే బయటకు తీస్తే ‘ఎల్లమ్మ’ తర్వాత లెక్క మారొచ్చు. మ్యూజిక్ కోసం డీఎస్పీ పేరు చూసే వాళ్లు, నటుడిగా కూడా అతన్ని అంగీకరిస్తారా అన్నది ఈ సినిమాతో తేలుతుంది. సినిమా రిలీజ్ తర్వాత పాటలు హైలెట్ అయితే ‘దేవి’ తన పని చేసినట్టే. పర్షి పాత్ర ఎక్కువగా మాట్లాడుకుంటే ‘ప్రసాద్’ కూడా గెలిచినట్టే. 

This post was last modified on August 24, 2026 11:24 pm

Share

Recent Posts

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

16 minutes ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

1 hour ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

3 hours ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

5 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

6 hours ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

6 hours ago