Political News

అప్పట్లో బాబు అసెంబ్లీకి రాకపోయినా…

ఈనెల 17 వ తేదీన ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నాలుగు రోజులపాటు జరిగాయి. బిజినెస్ అడ్వయిజరీ కమిటీలో నిర్ణయించిన ప్రకారం నేటితో ముగుస్తుంది. ఈసారి కూడా శాసన సభా సమావేశాలకు ప్రతిపక్ష వైసీపీ డుమ్మా కొట్టింది. డీఎస్సీ నియమకాలకు సంబందించి అక్రమాలు జరిగాయంటూ రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేస్తున్న వైసీపీ అసెంబ్లీకి మాత్రం గైర్హాజరయ్యింది. నిజంగా డీఎస్సీ అక్రమాలపై చిత్తశుద్ధి వుంటే అసెంబ్లీలో దాని మీద చర్చించాల్సిందని అధికార కూటమి ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ప్రజా సంఘాలు కూడా జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడం సరైన నిర్ణయం కాదని చెబుతున్నారు.

జగన్ కు అసెంబ్లీ కి రావాలంటే భయమని, అసెంబ్లీకి వస్తే గ్రూప్- 1 స్కామ్ గురించి జవాబు చెప్పాల్సి వస్తుందన్న భయంతోనే డీఎస్సీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. జగన్ అసెంబ్లీకి రాకుండా బయట చెప్పే మాటలకు విశ్వసనీయత ఉండదని స్పష్టం చేశారు. శాసనసభలోని తన కార్యాలయం వద్ద సీఎం
చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. పాలక పక్షం తప్పులు చేస్తుంటే చట్ట సభలో ఎత్తి చూపాల్సిన ప్రతిపక్షం అసెంబ్లీకి రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యల మీద వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సూచించారు.

వైసీపీ హయాంలో తాను అసెంబ్లీకి వెళ్ళక పోవడం గురించి కూడా చంద్రబాబు ప్రస్థావించారు. అప్పట్లో తాను అసెంబ్లీకి వెళ్లకపోయినప్పటికీ మిగతా సభ్యులు హాజరయ్యారని గుర్తు చేశారు. మొత్తం సభ్యులు హాజరుకాకపోవడం తొలిసారిగా చూస్తున్నానని చెప్పారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానించడమే అని చెప్పారు. డీఎస్సీ మీద మేము చర్చకు సిద్దమేనంటూ పలుమార్లు ప్రకటించినప్పటికి వైసీపీ నుంచి స్పందనలేకపోవడం వారి వైఖరికి అద్దం పడుతుందని విమర్శించారు.

This post was last modified on August 20, 2026 5:41 pm

Share

Recent Posts

బ్లడీ రోమియోకి లెక్కలు కుదురుతున్నాయి

మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…

4 hours ago

డ్రాగన్ మాట మీద నిలబడితే చాలు

ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…

4 hours ago

బలహీనపడటాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు

కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…

5 hours ago

ఏపీలో లిక్కర్ క్వాలిటీ చెకింగ్ కు క్యూఆర్ కోడ్!

2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…

7 hours ago

అప్పుడు అనారోగ్యం గుర్తు లేదా అంబటి?

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…

7 hours ago

తేజ సజ్జ తెలివికి ఇదే నిదర్శనం

యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…

7 hours ago