Political News

అత‌ను జ‌న‌సేన నుంచి ఔట్… ఆమె బీజేపీలోకి

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ మీద లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేసి వార్త‌ల్లో నిలిచిన శ్ర‌ష్ఠి వ‌ర్మ.. రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఆమె కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరింది. సోమ‌వారం హైద‌రాబాద్‌లో తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు ఎన్.రామ‌చంద్ర‌రావు, సీనియ‌ర్ నేత ల‌క్ష్మ‌ణ్‌ల స‌మ‌క్షంలో శ్ర‌ష్ఠి భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరింది. రామ‌చంద్ర‌రావు.. శ్ర‌ష్ఠికి బీజేపీ కండువా క‌ప్పి పార్టీలోక ఆహ్వానించారు.

శ్ర‌ష్ఠి వ‌ర్మ గురించి ఎవ‌రికీ తెలియ‌ని టైంలో రెండేళ్ల కింద‌ట జానీ మాస్ట‌ర్ మీద లైంగిక వేధింపుల కేసు పెట్టి వార్త‌ల్లోకి వ‌చ్చింది. ఒక‌ప్పుడు జానీకి అసిస్టెంట్‌గా చాలా కాలం ప‌ని చేసిందామె. ఆ స‌మ‌యంలోనే త‌న‌పై జానీ ప‌లుమార్లు అఘాయిత్యం చేసిన‌ట్లు ఆమె త‌ర్వాత కేసు పెట్టింది. ఈ కేసులో జానీ కొన్ని నెల‌లు రిమాండులో ఉన్నాడు.

త‌ర్వాత బెయిల్ మీద రిలీజ‌య్యాడు. ఈ కేసు ఇంకా కొన‌సాగుతూనే ఉంది. జానీ తిరిగి సినిమాల‌కు ప‌ని చేస్తున్నాడు. ఇటీవ‌ల డ్యాన్స‌ర్స్ అసోసియేష‌న్లో పెద్ద గొడ‌వ జ‌ర‌గ‌గా.. ఆ టైంలోనూ శ్ర‌ష్ఠి జానీ వ్య‌తిరేక వ‌ర్గం వైపు నిలిచింది. ఇప్పుడు బీజేపీలో చేర‌డం ద్వారా శ్ర‌ష్ఠి వార్త‌ల్లో నిలిచింది.

ఇక్క‌డో కీల‌క విష‌యం ఏంటంటే.. ఏపీలో బీజేపీకి మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన పార్టీకి జానీ మ‌ద్ద‌తుదారు. అత‌ను కొన్నేళ్ల పాటు ఆ పార్టీలో ప‌ని చేశాడు. ఐతే జానీ మీద లైంగిక వేధింపుల కేసు న‌మోద‌య్యాక అత‌ణ్ని పార్టీ నుంచి ప‌క్క‌న పెట్టారు. ఐతే అధికారికంగా పార్టీలో లేక‌పోయినా.. అత‌ను జ‌న‌సేన మ‌ద్ద‌తుదారుగానే కొన‌సాగుతున్నాడు. ప‌వ‌న్‌కు, మెగా ఫ్యామిలీకి జానీ స‌న్నిహితంగానే మెలుగుతున్నాడు. ఇలాంటి టైంలో జ‌న‌సేన మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీలో శ్ర‌ష్ఠి వ‌ర్మ చేర‌డం ఆస‌క్తిక‌ర‌మే. శ్ర‌ష్ఠి పుష్ప‌-2 స‌హా ప‌లు చిత్రాల‌కు అసిస్టెంట్ కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేసింది.

This post was last modified on August 17, 2026 6:48 pm

Share

Recent Posts

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

2 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

4 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

7 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

8 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

8 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

9 hours ago