Political News

ఓటుకు నోటు తీసుకోవడం మానేయలేమా

ఎన్నికల్లో నోట్లు పంపిణీ చేస్తేనే ఓట్లు వేయడం మామూలైపోయింది. గత కొన్నేళ్లుగా ఈ దుస్సాంప్రదాయం పెరిగిపోయింది. దీంతో నిజంగా ప్రజలకు సేవ చేస్తున్న నాయకులు ఓటమి పాలవుతున్నారు. లక్ష పెట్టుబడి పెట్టి కోటి సంపాదించాలనుకునే రాజకీయ వ్యాపారులు గెలుస్తున్నారు. దీనివల్ల చట్ట సభల్లో ప్రజల గొంతు వినిపించడం ఆగిపోయింది. రాజకీయ అవినీతి పెచ్చు మీరింది. ఫలితంగా అభివృద్ధి కుంటు పడుతోంది. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేసి ఏడాది పూర్తయిన సందర్బంగా ఉండవల్లి లోని క్యాంప్ కార్యాలయం నుంచి మహిళలతో కలిసి బస్సులో ప్రయాణం చేశారు. మహిళలతో చంద్రబాబు మాట్లాడుతూ… ఎన్నికల్లో డబ్బులు తీసుకొని ఓటు వేయడం మానేయాలని సూచించారు. ఏ నాయకుడు కూడా ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని రాడని, వాళ్ళు పంపిణీ చేసేదాంత అవినీతి సొమ్మే అని చెప్పారు.

ఓటుకు 2 వేలు ఇచ్చిన వాళ్ళు గెలిచిన తర్వాత 2 లక్షలు సంపాదించుకుంటారు. వాళ్ళు సంపాదించే అవినీతి సొమ్ములో మీకు చిల్లర పైసలు విదుల్చుతారనికి చెప్పారు. ఒకసారి ఓటు అమ్ముకున్నాక నాయకులను ప్రశ్నించే పరిస్థితి ఉండదు. మనం చులకన అయిపోతాం. ఎన్ని పనులు చేసినా ఎవడు పది రూపాయలు ఎక్కువ ఇస్తే వాళ్లకు ఓటేస్తున్నారు. ఇది సరికాదని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. త్వరలో మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి. వరసగా మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో ధన ప్రవాహన్ని ఇప్పటి నుంచే అడ్డుకోవాలి. అది మహిళల నుంచే ప్రారంభం కావాలని ప్రజాస్వామిక వాదులు చర్చిస్తున్నారు. నోటుకు ఓటును అడ్డుకున్నప్పుడే సచ్చరిత కలిగిన నాయకులు ఎన్నికవుతారని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

This post was last modified on August 16, 2026 9:30 am

Share

Recent Posts

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

1 hour ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

1 hour ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

4 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

4 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

6 hours ago