ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ పారిశ్రామిక పెట్టుబడి దారులను కలిసిన ఏపీ మంత్రి నారా లోకేష్.. ఏపీలో ఉన్న అవకాశాలను వారికి వివరించారు. పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గుజరాత్‌కు చెందిన పలువురు నాయకులు.. మా రాష్ట్రంలోనూ పోటీ పెంచేస్తున్నారు.. అంటూ లోకేష్‌తో సరదాగా వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రస్తుతం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సీఐఐ సదస్సు జరుగుతోంది. దీనికి మంత్రి హాజరయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించారు.
ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్, పవర్, గ్యాస్, ఎలక్ట్రికల్ రంగాల్లో ఏపీ ఇస్తున్న ప్రోత్సాహకాలను, పారిశ్రామిక వేత్తలకు ఉన్న అవకాశాలను ఆయన వివరించారు. ప్రఖ్యాత టోరెంట్ గ్రూప్ చైర్మన్ సమీర్ మెహతా, డైరక్టర్ షాన్ మెహతా, హోల్ టైమ్ డైరక్టర్ జిగీష్ మెహతాలతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… బ్యాక్‌వర్డ్ ఇంటిగ్రేషన్ కోసం టోరెంట్ వైజాగ్ ప్లాంట్ ఏపీఐలు, అధునాతన ఇంటర్మీడియట్‌లపై దృష్టి సారించిన నేపథ్యంలో, రాష్ట్రంలోని ఫార్మా క్లస్టర్లలో ఏపీఐ తయారీ, ఇంటర్మీడియట్ సామర్థ్యాలను విస్తరించే అవకాశాలను అన్వేషించాలని సూచించారు.
కంపెనీ తన రెన్యువబుల్ ఎనర్జీ పోర్ట్‌ఫోలియోను గణనీయంగా విస్తరించాలనే ప్రణాళికల దృష్ట్యా, ముఖ్యంగా పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు సరఫరా చేయడానికి, ఆంధ్రప్రదేశ్‌లో సౌర, పవన, హైబ్రిడ్ పునరుత్పాదక ప్రాజెక్టుల అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ మాలిక్యూల్స్‌లోకి టోరెంట్ పవర్ ప్రకటించిన విస్తరణ ప్రణాళికకు అనుగుణంగా, పంప్డ్-స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, సంబంధిత క్లీన్-ఎనర్జీ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ను ఎంపికచేసుకోవాలన్నారు.
టోరెంట్ తమ పెట్టుబడి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను విశ్వసించినందుకు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. టోరెంట్ చైర్మన్ సమీర్ మెహతా మాట్లాడుతూ… తమ సంస్థ హై పొటెన్షీ ఉత్పత్తుల కోసం తయారీ సామర్థ్యాన్ని విస్తరిస్తున్నట్లు చెప్పారు. టోరెంట్ పవర్ 3.96 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు, 3గిగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజి సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తూ.. గ్రీన్ హైడ్రోజన్, ఇతర క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులను అన్వేషిస్తోందన్నారు. 2030 నాటికి 10 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ సామర్థ్యానికి చేరుకోవడమే తమ లక్ష్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు.
This post was last modified on September 25, 2026 9:02 pm
టాలెంట్ లోటు లేకపోయినా కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల ప్రియదర్శి కెరీర్ రెండు హిట్లు నాలుగు ఫ్లాఫుల్లా సాగిపోతోంది.…
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఉద్దేశించి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు సీరియస్‌గా ఉన్న…
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ 2 మీద అంచనాలు ఏ స్థాయిలో…
స్టార్ హీరోలకు వేగం అవసరం. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి లాంటి వాళ్ళు ఏడాదికి పది నుంచి పదిహేను సినిమాలు…
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను అభిశంసించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఆ పదవికి ఆయన అనర్హుడని.. పేర్కొంటూ..…
ప్రీమియర్ షో పూర్తయినప్పటి నుంచి ది ప్యారడైజ్ మీద సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రచ్చ అందరూ చూస్తున్నదే. పాజిటివ్…