మెగాస్టార్ చిరంజీవి ఏ ఈవెంట్‌కు హాజరైనా తనదైన శైలిలో పంచులు వేస్తూ.. హుషారుగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. తెర మీదే కాదు.. బయట కూడా తన కామెడీ టైమింగ్‌కు తిరుగులేదని చాటుతుంటారు. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా.. తమిళనాడు సీఎం తనయుడు జేసన్ సంజయ్ రూపొందించిన సిగ్మా మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్.. ఇక్కడా తన మార్కు చూపించారు.
ముఖ్యంగా ఫరియా అబ్దుల్లా గురించి మాట్లాడేటపుడు చిరు తనదైన శైలిలో హాస్యం పండించారు. ఫరియా తనకంటే హైట్ ఉండడాన్ని గుర్తు చేస్తూ.. ఒక సందర్భంగా కాళ్లు పైకెత్తి నిలబడుతూ అందరినీ నవ్వించిన చిరు.. తర్వాత ఆమె గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈనాడు-ఈటీవీకి సంబంధించిన ఒక ఈవెంట్లో ఫరియాతో కలిసి డ్యాన్స్ చేసిన సందర్భాన్ని చిరు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆ ఈవెంట్‌కు వెళ్లినపుడు హుందాగా ఉండాలి, డ్యాన్స్ చేయకూడదని అనుకున్నానని.. కానీ ఫరియా ఉత్సాహం చూసి.. ఆమె రెచ్చగొట్టడంతో డ్యాన్స్ ఆపుకోలేకపోయానని, అదొక అందమైన మూమెంట్ అని చిరు అన్నారు.
ఇక ఫరియా తనతో విశ్వంభరతో నటించాల్సిందని, కానీ ఎందుకో ఆ సినిమాలో మిస్సయిందని చిరు చెప్పడం విశేషం. ఈ సందర్భంగా మరోసారి చిరు.. ఫరియా హైట్ ప్రస్తావన తెచ్చారు.
తనకంటే ఎక్కువ హైట్ ఉండడం వల్లేమీ ఆమె ఈ సినిమాకు దూరం కాలేదని.. ఎత్తే సమస్య అనుకుంటే తాను హైహీల్స్ వేసుకుని మేనేజ్ చేసేవాడినని చిరు చమత్కరించారు. వేరే ఏదో కారణంతోనే ఆమె విశ్వంభర చేయలేకపోయిందని.. కానీ ఇంకో సినిమాకు ఇద్దరం కలిసి పని చేస్తామని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా మాటల మధ్యలో ఫరియా తనను తొక్కేయాలని చూస్తుందేమో అంటూ చిరు చమత్కరించారు. చిరు తనతో పోటీగా ఉన్న వారిని, యంగ్ హీరోలను తొక్కేస్తాడంటూ సోషల్ మీడియాలో ఈ మధ్య ఆయన మీద ట్రోల్స్ వేస్తోంది ఒక వర్గం. దానికి కౌంటర్‌గానే చిరు సరదాగా ఈ డైలాగ్ వేసినట్లుగా భావిస్తున్నారు. చిరు కూడా ఈ సోషల్ మీడియా ట్రాల్స్, మీమ్స్ చూస్తారని ఫాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
This post was last modified on September 26, 2026 9:18 am
ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…
వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…