Political News

పెన‌మ‌లూరులో బోడేదే పైచేయి…!

పార్టీ ఒక‌టే కానీ.. అంత‌ర్గ‌త కూట‌ములు చాలానే ఉన్నాయి. ఆ నియోజ‌క‌వ‌ర్గం స్పెష‌ల్ అదే. ఇత‌ర నియోజ‌క వ‌ర్గాల్లోనూ నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాలు ఉన్నా.. ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ఇవి మ‌రింత భిన్నంగా ఉంటున్నాయి. గ‌త 2019 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ నాయ‌కులు వ‌ర్గాలుగా విడిపోయి.. మండ‌లాల‌ను పంచేసుకున్నారు. ఫ‌లితంగా ఎగ‌స్పార్టీ పెరిగి.. పార్టీలో ఐక్య‌త స‌న్న‌గిల్లి ఓట‌మికి దారితీసింది. బ‌ల‌మైన టీడీపీ కంచుకోటగా గుర్తింపు ఉన్నా.. గెలుపులో వెనుక‌బ‌డింది.

ఈ ద‌ఫా అలాంటి ప‌రిస్థితి రాకుండా.. ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్ చాలా వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా వ‌ర్గ‌పోరును ఎక్క‌డిక‌క్క‌డే తగ్గించుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ఒక‌ప్పుడు పార్టీలో నాయ‌కుల‌కు ఆయ‌న‌కు విభేదాలు కొన‌సాగ‌గా.. ఇప్పుడు తానే స్వ‌యంగా నాయ‌కుల‌కు చేరువ అవుతున్నారు. ఎవ‌రో రావాలి.. అని ఎదురు చూడ‌కుండా.. వారి చెంత‌కు ఆయ‌నే వెళ్తున్నారు. పార్టీ కార్య‌క్ర‌మ‌మైనా.. ప‌ర్స‌న‌ల్ కార్య‌క్ర‌మ‌మైనా నాయ‌కుల ఇళ్ల‌కు వెళ్తున్నారు. త‌ద్వారా ఆయ‌న వ్య‌క్తిగ‌త గ్రాఫ్‌ను పెంచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఉమ్మ‌డి విజ‌యం

ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతున్న ఇంటింటికీ టీడీపీ కార్య‌క్ర‌మంలో ఉమ్మ‌డిగా నాయ‌కుల‌ను ముందుకు తీసు కువెళ్ల‌డంలో బోడే స‌క్సెస్ అయ్యారు. ఒక‌ప్పుడు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా కానూరు మండ‌లంలో సై అన్న నాయ‌కులు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేతో పాటు క‌లిసిముందుకు సాగుతున్నారు. అలానే.. బీజేపీ, జ‌న‌సేన‌లో ఉన్న కొద్ది మంది నాయకుల‌ను కూడా క‌లుపుకొని ముందుకు వెళ్తున్నారు. భేష‌జాల‌కు అవ‌కాశం లేకుండా.. బోడే వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు అంత‌ర్గ‌త వివాదాల‌కు తావు లేకుండా సాగేలా చేస్తోంది.

మ‌రోవైపు.. వైసీపీకి పెన‌మ‌లూరులో బ‌ల‌మైన నాయ‌కులు లేకుండా పోయారు. గ‌తంలో కొలుసు పార్థ‌సార‌థి ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకున్నాక‌.. ఆయ‌న వ‌ర్గాల‌ను మెయింటెన్ చేశార‌న్న వాద‌న ఉంది. అదే వ‌ర్గ పోరు వైసీపీని ఇబ్బంది పెట్టింది. ఈ పోరు ఇంకా కొన‌సాగుతోంది. దీనికి తోడు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రికి టికెట్ ఇస్తార‌న్న‌ది చ‌ర్చ‌నీ యాంశంగా మారింది. ఈ విష‌యం తేల‌క‌పోవ‌డంతో జెండా ప‌ట్టుకునేవారు.. పార్టీవాయిస్ వినిపించేవారు లేక పోవ‌డం కూడా టీడీపీ ఎమ్మెల్యేకు అందివ‌చ్చిన అవ‌కాశంగా మారి.. బోడేదే పైచేయిగా ప్ర‌స్తుతం క‌నిపిస్తోంది.

This post was last modified on August 14, 2026 12:58 pm

Share

Recent Posts

`అయోధ్య‌`కు రాజ‌కీయ గ్ర‌హ‌ణం వీడిన‌ట్టేనా?!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత రామ‌జ‌న్మ‌భూమి అయోధ్యలో ఉన్న బాల‌రామ‌య్య ఆల‌యానికి రాజ‌కీయ గ్ర‌హ‌ణం వీడిన‌ట్టేనా? ఇక‌, ఆల‌యానికి రాజకీయ ప్ర‌భావం,…

3 hours ago

సూర్య ఛెప్పిన కార్తి ‘పొటాటో చిప్స్’ కథ

సౌత్ ఇండియన్ సినిమాలో మోస్ట్ సెలబ్రేటెడ్ సినీ బ్రదర్స్‌లో సూర్య-కార్తి ద్వయం ముందు వరుసలో ఉంటుంది. వీళ్లిద్దరూ తండ్రి శివకుమార్…

3 hours ago

హీరో దర్శకత్వపు కల… అదెప్పుడు నెరవేరునో

టాలీవుడ్ కామెడీని కొత్త పుంతలు తొక్కించిన వాళ్ళలో జంధ్యాల, రేలంగి నరసింహరావు, సింగీతం శ్రీనివాసరావు తర్వాత ఈవివి సత్యనారాయణ తనకంటూ…

5 hours ago

సాక్షిలో రెండో పేజీకి చేరిన రాజన్న

ఇవ్వాళ సెప్టెంబర్ 2 వ తేదీ. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం 2009 సెప్టెంబర్…

6 hours ago

తెలంగాణా బీజేపీలో కారు లొల్లి

తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…

7 hours ago

ఓజి యునివర్స్ ఊహించనంత పెద్దగా

ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…

8 hours ago