వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. తన వ్యాఖ్యలతో, దురుసు ప్రవర్తనతో అంబటి వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీసు అధికారితో అంబటి ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇక, తనను అడ్డుకున్న పోలీసులకు అంబటి వార్నింగ్ ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో సడెన్ గా పోలీసులపై అంబటి తీరు మారింది. గతంలో పోలీసులపై పరుష పదజాలంతో విరుచుకుపడిన అంబటి…తాజాగా పువ్వులతో పోలీసులను కూల్ చేశారు.
అవును…విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు అంబటి గులాబీ పూలిచ్చి గుడ్ బాయ్ అనిపించుకునే ప్రయత్నం చేశారు. గుంటూరులో డీఎస్సీ అభ్యర్థులు చేపట్టిన ర్యాలీకి సహకరించిన పోలీసులకు రోజ్ ఫ్లవర్ ఇచ్చారు ఫైర్ బ్రాండ్ అంబటి. ర్యాలీకి సహకరించి మండుటెండలో సైతం డ్యూటీ చేసిన పోలీసులను ఆయన అభినందించారు.
దీంతో, అంబటిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. అంబటి అంటే ఫైర్ అనుకుంటివా…ఫ్లవర్ కూడా ఇస్తారు అంటూ మీమ్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా పోలీసులకు పువ్వులిచ్చి బ్యాడ్ బాయ్ నుంచి గుడ్ బాయ్ గా మారాలనుకున్న అంబటి ప్రయత్నం అభినందనీయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates