కొత్త విద్యా మంత్రిగా జోషి… ఎవరీయన?

కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. కర్ణాటకకు చెందిన జోషి… 2019 నుంచి కేంద్ర కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌర సరఫరాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న జోషికి విద్యా శాఖ బాధ్యతలను కూడా అదనంగా అప్పగించారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము శనివారం రాత్రి ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. 

నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో విద్యార్థుల నిరసనల హోరు నేపథ్యంలో విద్యా శాఖ మంత్రిగా కొనసాగుతున్న ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రధాన్ విద్యా శాఖ మంత్రిగా రాజీనామా చేసిన వెంటనే… ఆ శాఖ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు? ఆ కొత్తగా వచ్చే నేత ఎవరు? ఆ కొత్త నేత ఏ మేరకు విద్యా శాఖ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారన్న దివగా పెద్ద ఎత్తున విశ్లేషణలు వెలువడ్డాయి. 

ప్రధాన్ రాజీనామా చేసిన విద్యా శాఖ మంత్రి పదవికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ కీలక నేత దేవేంద్ర ఫడ్నవీస్ ను ఎంపిక చేస్తారన్న వాదనలు వినిపించాయి. పెద్ద ఎత్తున విమర్శలు రేకెత్తిన విద్యా శాఖను ఫడ్నవీస్ అయితే గాడిన పెడతారన్న దిశగానూ విశ్లేషణలు సాగాయి. అయితే ఏ ఒక్కరూ ఊహించని విధంగా ప్రస్తుతం మోదీ కేబినెట్ లో కీలక మంత్రిగా కొనసాగుతున్న జోషికి విద్యాశాఖను అదనపు బాధ్యతగా అప్పగించడం గమనార్హం.

కర్ణాటకలోని మైసూరు ప్రాంతానికి చెందిన జోషి… ఆరెస్సెస్ నేపథ్యం కలిగిన నేతగా మంచి గుర్తింపు పొందారు. యుక్త వయసు నుంచే ఆరెస్సెస్ భావజాలంతో సాగిన జోషి… ఆ తర్వాత నేరుగా బీజేపీలో చేరిపోయారు. బీజేపీ కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగానూ ఆయన బాధ్యతలు చేపట్టారు. 2004లో మైసూరు ప్రాంతంలోని ధన్వాడ లోక్ సభ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికైన జోషి… ఆ తర్వాత వరుసబెట్టి ఐదు పర్యాయాలు అదే స్థానం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు.

2019లో మోదీ కేబినెట్ లో చో్టు దక్కించుకున్న జోషి… తొలుత గనుల శాఖ మంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత 2024లోనూ మోదీ కేబినెట్ లో వరుసగా రెండో సారి స్థానం దక్కించుకున్న జోషి… మోదీ కేబినెట్ లో కీలక మంత్రిగా కొనసాగుతున్నారు. తాజాగా విద్యా శాఖ బాధ్యతలు కూడా దక్కడంతో కేబినెట్ లో జోషికి మరింత ప్రాధాన్యం దక్కిందన్న వాదనలు వినిపిప్తున్నాయి.