Trends

దినేశ్ కార్తీక్‌కు మురళీ విజయ్ థ్యాంక్స్

మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్‌కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం జరిగిందన్నది తెలిస్తే మాత్రం ఇది చాలా పెద్ద వార్తే మరి. దినేశ్, విజయ్ ఇద్దరూ తమిళనాడు క్రికెటర్లే. టీమ్ ఇండియాకు సుదీర్ఘ కాలం పాటు ప్రాతినిధ్యం వహించారు. ఇద్దరూ మంచి మిత్రులు. దేశవాళీ క్రికెట్ నుంచే వాళ్లిద్దరికీ అనుభంధం ఉంది. 

కానీ ఈ ఇద్దరూ భారత జట్టుకు ఆడుతున్న సమయంలో దినేశ్ కార్తీక్ భార్య నిఖిత.. విజయ్‌కి ఆకర్షితురాలు కావడం.. అతడితో రిలేషన్‌షిప్‌లోకి వెళ్లడం.. తర్వాత దినేశ్ నుంచి విడిపోయి విజయ్‌ని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడం అప్పట్లో ఒక సంచలనమే. స్నేహితుడి భార్యతో ఎఫైర్ పెట్టుకుని, ఆమెను తన్నుకుపోయాడంటూ విజయ్ మీద చాలా ఏళ్ల పాటు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. నిఖిత కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దినేశ్ పట్ల అందరూ సానుభూతి వ్యక్తం చేశారు. ఐతే తర్వాత స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్‌ను పెళ్లాడి దినేశ్ వ్యక్తిగత జీవితంలో స్థిరపడడంతో మాజీ భార్య వ్యవహారాన్ని అందరూ మరిచిపోయారు.

ఐతే ఈ వివాదం వల్ల దినేశ్ కార్తీక్, మురళీ విజయ్ ఎప్పుడూ ఒకరి గురించి ఒకరు మాట్లాడేవారు కాదు. కానీ మురళీ విజయ్ ఇప్పుడు తమిళనాడు క్రికెట్ సంఘం నిర్వహించిన ఒక కార్యక్రమంలో దినేశ్ కార్తీక్ పేరు ప్రస్తావించి.. అతడికి థ్యాంక్స్ చెప్పడం చర్చనీయాంశమవుతోంది. దినేశ్ కార్తీక్ గురించి తాను మాట్లాడితే ఏదోలా అనిపించవచ్చని.. కానీ చిన్నతనం నుంచి అతను తనకు మంచి స్నేహితుడని మురళీ విజయ్ వ్యాఖ్యానించాడు. తమిళనాడు క్రికెట్ చరిత్రలోనే అతను అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్ అని.. డైనమిక్ క్రికెటర్ అని విజయ్ కొనియాడాడు. 

అతను తనకు మించి మిత్రుడైనప్పటికీ.. తన ఆటకు మాత్రం తాను అభిమానినని విజయ్ అన్నాడు. నాన్ స్ట్రైక్ ఎండ్ నుంచి ఎన్నోసార్లు తన ఆటను ఆస్వాదించానన్నాడు. దినేశ్‌కు తెలియకుండా తనకు ఎంతో చేశాడని.. అందుకు అతడికి థ్యాంక్స్ చెబుతున్నానని మురళీ విజయ్ వ్యాఖ్యానించాడు. వ్యక్తిగత జీవితంలో జరిగింది పక్కన పెట్టి ఇలా దినేశ్‌ గురించి విజయ్ మాట్లాడడం.. అతణ్నిలా కొనియాడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

This post was last modified on July 5, 2026 10:30 pm

Share

Recent Posts

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

28 minutes ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

3 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

5 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

6 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

6 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

7 hours ago