Political News

విజయవాడే మన రాజధాని…జగన్ మళ్లీ ఏసేశారు!

రాష్ట్ర రాజధాని విషయంలో జగన్ తీసుకుంటున్న యూ టర్న్ లపై ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు..మరి వైజాగ్ రాజధాని సంగతేంటి సర్ అని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వకుండా జారుకున్న జగన్ పై మీమ్స్ పేలుతున్నాయి.

ఆ మీమ్స్ వేడి చల్లారక ముందే మీమర్లు అన్ లిమిటెడ్ బఫెట్ మాదిరి మీమ్స్ ఫెస్ట్ చేసుకునేలా అదిరిపోయే స్టేట్మెంట్ ఇచ్చారు. వాస్తవానికి మన రాజధాని అమరావతి కాదు…విజయవాడే మన రాజధాని అంటూ జగన్ చేసిన తాజా కామెంట్ల తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు వేధింపుల వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నాననంటూ క్రాంతి కుమార్ ఆరోపిస్తూ సెల్ఫీ సూసైడ్ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించేందుకు విజయవాడ వెళ్లిన సందర్భంలో జగన్ ఈ కామెంట్స్ చేశారు.

ఇదంతా కూడా సో కాల్డ్ క్యాపిటల్, సో కాల్డ్ రాజధానిలో జరుగుతోందని జగన్ అన్నారు. చంద్రబాబు కూడా పక్కనే ఉంటారని, అమరావతి కాదు మన రాజధాని..సో కాల్డ్…వాస్తవం చెప్పాలంటే విజయవాడే మన రాజధాని అని జగన్ చెప్పారు.

కళ్లెదుటే పోలీస్ స్టేషన్, సీపీ కార్యాలయం, డీజీపీ ఆఫీస్, హోం మంత్రి ఆఫీస్, సీఎం…. అందరం ఇక్కడే ఉంటామని అన్నారు జగన్. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కూడా సీపీ పరిధిలోకే వస్తుందని చెప్పారు. క్రాంతి కుమార్ తండ్రి విజయవాడ సీపీని కలిసి, ఆ సూసైడ్ వీడియో చూపించి, ఇది తన కుమారుడి మరణ వాంగ్మూలం అని ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. క్లియర్ కట్ గా రాజధానిలో ఒక రాకెట్ నడుపుతున్నారంటూ జగన్ విజయవాడే రాజధాని అని నొక్కి వక్కాణించారు.

వాస్తవానికి జగన్ సో కాల్డ్ రాజధాని అమరావతి అని చెబుతూనే విజయవాడే మన రాజధాని అని అన్నారు. అంటే, అమరావతి సో కాల్డ్ రాజధాని అయినప్పుడు విజయవాడ కూడా సో కాల్డ్ రాజధాని అన్న ఉద్దేశ్యంలో జగన్ ఆ కామెంట్లు చేసి ఉండవచ్చు. కానీ, ఇలా పూటకో సారి రాజధాని విషయంలో జగన్ మాట మారుస్తుండడంతో రాజధాని విషయంపై జగన్ కు క్లారిటీ లేదని విమర్శలు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే వైసీపీ నేతలు, కార్యకర్తల్లో చాలామందికే జగన్ కామెంట్లు మింగుడుపడడం లేదు. రాజధాని విషయంలో జగన్ తీసుకుంటున్న యూటర్న్ లపై నెటిజన్లు మీమ్స్ తో పండగ చేసుకుంటున్నారు. రాజధాని విషయంలో జగన్ ను నమ్ముకుంటే వైసీపీ నేతలు, కార్యకర్తలకు అస్సామే అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

This post was last modified on July 2, 2026 2:31 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

3 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

6 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

6 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

6 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

6 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

7 hours ago