Movie News

నాగబంధం VFX దారి చూపగలదా

రేపు విడుదల కాబోతున్న నాగబంధంకు ఇవాళ హైదరాబాద్ లో స్పెషల్ ప్రీమియర్ వేస్తున్నారు. దీంతో పాటే రిలీజవుతున్న రావు బహదూర్ అలాంటి ప్లానింగ్ వద్దనుకుని నేరుగా ఒరిజినల్ డేట్ కే కట్టుబడి ఉంది. నాగబంధం విషయానికి వస్తే విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో సుమారు వంద కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టారు. విదేశీ కంపెనీల మీద ఆధారపడకుండా హైదరాబాద్ లోనే గ్రాఫిక్స్ వర్క్ చేయించుకున్నారు. ట్రైలర్ లో క్వాలిటీ ఆడియన్స్ ని ఆశ్చర్యపరిచింది.

థియేట్రికల్ గా నాగబంధం ఎంత స్థాయిలో ఆడుతుందనే పాయింట్ తో పాటు ఒక ముఖ్యమైన విషయంలో ఇండస్ట్రీ కళ్ళు దీని మీద ఉన్నాయి. అదేంటంటే విఎఫ్ఎక్స్ నాణ్యత తెరమీద ఎలా వచ్చింది, ఇంత క్లిష్టమైన లోతున్న డివోషనల్ సబ్జెక్టుని కన్విన్సింగ్ గా ఎలా చెప్పగలిగారనేది చూడటం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. వంద కోట్లు పెద్ద మొత్తమే అయినా ఇప్పుడున్న ట్రెండ్ లో స్టార్ హీరోల లెక్కల్లో చూసుకుంటే ఇది కొంచెం తక్కువగానే అనిపిస్తుంది.

ఒకవేళ ప్రేక్షకులను కనక నాగబంధం క్వాలిటీతో మెప్పించగలిగి, కంటెంట్ బాగుంటే వేరొకరికి దారి చూపించే అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఇబ్బందులు పడుతున్న ప్యాన్ ఇండియా మూవీస్ టాలీవుడ్ లో చాలా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర, నిఖిల్ స్వయంభు ఆ విషయంలో రాజీ పడలేక బెస్ట్ అవుట్ ఫుట్ కోసం పోరాడుతున్నాయి. ఒకవేళ నాగబంధం కనక సక్సెస్ అయితే వీటికి కొంత బూస్టప్ లాగా ఉంటుందనేది వాస్తవం.

బాక్సాఫీస్ వద్ద నాగబంధంకు మంచి ఛాన్స్ ఉంది. పెద్ది రన్ దాదాపుగా ముగిసిపోయి మా ఇంటి బంగారం నెమ్మదించిన టైంలో మంచి వసూళ్లు రాబట్టుకోవడానికి ఇదే మంచి టైం. నాగబంధం ముఖ్యంగా చిన్నపిల్లలను కుటుంబాలను టార్గెట్ చేస్తోంది. అయితే మూడు గంటలకు పైగా నిడివిని పెట్టడం చూస్తుంటే కంటెంట్ మీద మాములు నమ్మకం కనిపించడం లేదు. క్లిక్ అవుతుందనే ధీమాలో ఉన్నారు. అదే జరిగితే డెబ్యూతో నిరాశపడ్డ విరాట్ కర్ణకు తొలి బ్రేక్ దక్కినట్టు అవుతుంది.

This post was last modified on July 2, 2026 1:23 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

3 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

5 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

5 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

5 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

5 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

6 hours ago