గత ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో ఆరుగురు సైనికులు వీరమరణం చెందినట్టు కేంద్రం తాజాగా వెల్లడించింది. దాదాపు 13 మాసాల తర్వాత ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. వీరిలో ఐదుగురు సైనిక శాశ్వత అధికారులు ఉన్నారు. మరొకరు అగ్నివీర్ ఉన్నారు. వీరి పేర్లను జాతీయ యుద్ధ స్మారకం వద్ద పొందుపరచనున్నారు.
అమరులైంది వీరే..
1) సుబేదార్ మేజర్ పవన్ కుమార్ (10 ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్స్)
2) రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్( జమ్మూకశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్)
3) లాన్స్ నాయక్ దినేశ్ కుమార్ (5 ఫీల్డ్ రెజిమెంట్)
4) హవల్దార్ సునీల్ కుమార్ సింగ్(237 ఫీల్డ్ వర్క్‌షాప్)
5) సార్జెంట్ సురేంద్ర కుమార్(ఎయిర్‌ఫోర్స్ -39)
6) అగ్నివీర్ మురళీ నాయక్(851 లైట్ రెజిమెంట్)
ఆపరేషన్ సిందూర్ ఇదీ..
జమ్ము కశ్మీర్‌లోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం పహల్గామ్‌లో గత ఏడాది ఏప్రిల్ 16న ఉగ్రవాదులు దాడులు చేశారు. పర్యాటకుల పేర్లు, ఊర్లు, కులాలు, మతాలు అడిగి మరీ కాల్పులు జరపడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. నాటి దారుణ ఘటనలో మొత్తం 26 మంది పౌరులు మృతి చెందారు. వీరిలో నేపాల్‌కు చెందిన ఒక పౌరుడు కూడా ఉన్నారు. ఇక, ఏపీ నుంచి ఇద్దరు, తెలంగాణకు చెందిన ఒకరు కూడా నాటి దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.
దీనికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు, ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత త్రివిధ దళా లు ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేపట్టాయి. ఆ దాడుల్లో ఉగ్రవాదులకు చెందిన శిక్షణ శిబిరాల ను నేలమట్టం చేయడంతోపాటు పలువురు ఉగ్రవాదులను కూడా మన సైన్యం హతమార్చింది. అయితే.. పాక్ జరిపిన ఎదురు దాడుల్లో భారత సైన్యానికి చెందిన ఆరుగురు అమరులయ్యారని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.
This post was last modified on June 26, 2026 5:42 pm
ఒకసారి టీమ్ఇండియా నుంచి బయటకు వెళ్లాక నాలుగేళ్ల తర్వాత మళ్ళీ రావడం అంత ఈజీ కాదు. అందులోనూ 36 ఏళ్ల…
స్థానిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అధికార కూటమి భావిస్తోంది. వీలైంత వరకు ఎన్నికలు…
ఆదర్శ కుటుంబం తప్పుకుంది. అక్టోబర్ 2 విడుదలైన వాటికి పెద్దగా ఆదరణ దక్కలేదు. సో దసరా పండక్కు వచ్చే సెలవులను…
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…