Movie News

వారణాసి మాట మార్చే ఛాన్స్ లేనట్టే

రాజమౌళి సినిమాలకు ఎప్పుడూ వచ్చే సమస్య ఒకటుంది. అదే చెప్పిన రిలీజ్ డేట్ కి కట్టుబడకపోవడం. బాహుబలి రెండు భాగాలు, ఆర్ఆర్ఆర్ కి ఇది జరిగింది. ఇప్పుడు వారణాసికి కూడా అదే రిపీటవుతుందనే అనుమానం మహేష్ బాబు అభిమానులకు రావడం సహజం. అసలే గుంటూరు కారం తర్వాత మూడేళ్ళ గ్యాప్ వచ్చింది. అందుకే ఎలాంటి వాయిదాలు లేకుండా రావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ ఆందోళనకు చెక్ పెడుతూ రాజమౌళి స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు.

అక్టోబర్ చివరికంతా షూటింగ్ పూర్తవుతుందని, ఇప్పటికే కీలకమైన ఎపిసోడ్ల చిత్రీకరణ ఫినిష్ చేశామని, లింకింగ్ సన్నివేశాలు, ప్యాచ్ వర్క్స్ అన్నీ త్వరలోనే కానిచ్చేసి గుమ్మడికాయ కొట్టేస్తామని స్పష్టమైన సంకేతం ఇచ్చారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ కు అయిదు నెలల సమయం సరిపోతుందా అంటే సమాధానం వెంటనే చెప్పలేం. జక్కన్న పెట్టుకున్న స్కేల్ కి, వరల్డ్ వైడ్ రావాలనుకుంటున్న రీచ్ కి ఆషామాషీ పబ్లిసిటీ చేస్తే సరిపోదు. ఓ రేంజ్ లో పనవ్వాలి.

సో రాజమౌళి మనసులో ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయో ఒక్కొక్కటిగా బయటికి వస్తే తప్ప క్లారిటీ రాదు. వారణాసి రిలీజ్ వరకు తన పేరు సోషల్ మీడియాలో నానుతూ ఉండేలా చేసుకోవడం ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే మార్కెటింగ్. బాహుబలి టార్చ్ బేరర్ పేరుతో వదిలిన మేకింగ్ వీడియోకు బ్రహ్మాండమైన స్పందన దక్కింది. ఎక్స్ మొత్తం దీని వీడియోలతో నిండిపోయింది. గత ఏడాది బాహుబలి ఎపిక్ తో వార్తల్లోకి వచ్చిన ఈ ఇండియన్ స్పిల్బర్గ్ ఇప్పుడు మరోసారి హైలైట్ అవుతూ వస్తున్నారు.

2017 ఏప్రిల్ 7 వారణాసి థియేటర్లలో అడుగు పెట్టాలి. దానికి అనుగుణంగానే బిజినెస్ వ్యవహారాలు డిసెంబర్ నుంచి ఊపందుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికైతే అమ్మకాలు చేయలేదు. ట్రైలర్ వచ్చాక అంచనాలు ఎక్కడికి వెళ్తాయో ఊహించడం కష్టమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మహేష్ బాబు ఈ ప్యాన్ వరల్డ్ మూవీ ఫలితం వచ్చేదాకా ఇంకే దర్శకుడికి ఎస్ చెప్పే ఉద్దేశంలో లేరట. పలువురు దర్శకులు కలిసినప్పటికీ ఎవరికీ స్పష్టమైన హామీ లభించలేదని వినికిడి.

This post was last modified on June 26, 2026 8:08 pm

Share

Recent Posts

ఏమీ పట్టనట్టు వుంటే ఎలా జగన్?

స్థానిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అధికార కూటమి భావిస్తోంది. వీలైంత వరకు ఎన్నికలు…

14 minutes ago

విజయదశమి క్లాష్… ‘పంచతంత్ర’ పోటీ

ఆదర్శ కుటుంబం తప్పుకుంది. అక్టోబర్ 2 విడుదలైన వాటికి పెద్దగా ఆదరణ దక్కలేదు. సో దసరా పండక్కు వచ్చే సెలవులను…

38 minutes ago

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

11 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

12 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

12 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

12 hours ago