కేంద్ర మంత్రివర్గం ప్రక్షాళన దాదాపు ఖరారైన నేపథ్యంలో ఏపీ నుంచి మరో ఇద్దరు ఎంపీలకు మంత్రి యోగం పట్టనుందని టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు మంత్రులుగా ఉన్నారు. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడులు మంత్రి పదవులు పొందారు. అయితే.. ఇప్పుడు జరగనున్న మంత్రివర్గ విస్తరణలో భాగంగా దక్షిణాదికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు.
మరీ ముఖ్యంగా 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి, జనసేనకు కూడా ప్రాధాన్యం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ తగ్గిన నేపథ్యంలో టీడీపీ, జనసేన బలమైన మద్దతు ప్రకటించి.. కేంద్రంలో అధికారం దక్కించుకునేందుకు బీజేపీకి సహకరించాయి. ప్రస్తుతం ఉత్తరాదిలో బీజేపీ హవా తగ్గుతూ వస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి దక్షిణాదిపైనే ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది.
దీనిని ముందుగానే పసిగడుతున్న బీజేపీ పెద్దలు.. దక్షిణాదిలో విస్తరించేందుకు తమిళనాడు ఎన్నికలను ప్రధానంగా భావించారు. కానీ, ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో తమ మిత్రపక్షాలను మరింత దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే ఏపీకి మరో రెండు మంత్రి పదవులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. వీటిలో సహాయ మంత్రులు లేదా.. ఇండిపెండెంట్ మంత్రిత్వ శాఖలు ఉండే అవకాశం ఉందని సమాచారం.
ఈ రెండు కూడా.. టీడీపీకి ఒకటి జనసేనకు ఒకటి కేటాయించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం టీడీపీ మంత్రులుగా ఉన్నవారిలో ఒకరు ఇండిపెండెంట్ చార్జిలో ఉండగా.. మరొకరు సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి.. ఈ దఫా రెండు పదవులు కూడా సహాయ మంత్రులుగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదేమైనా కేంద్రంలో మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా కూటమి ఐక్యతను మరింత పెంచడంతోపాటు దక్షిణాది మిత్రులకు ప్రాధాన్యం ఇస్తున్నామన్న సంకేతాలు ఇవ్వడం గమనార్హం.
This post was last modified on June 24, 2026 9:43 pm
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…