Movie News

వారణాసి సెట్… 7 గంటలకు షూటింగ్ అంటే

కెరీర్లో ఒక ద‌శ వ‌ర‌కు మామూలు మాస్ మ‌సాలా సినిమాలే తీశాడు రాజ‌మౌళి. మ‌గ‌ధీర నుంచి ఆయ‌నలోని మ‌రో కోణం బ‌య‌టికి వ‌చ్చింది. అప్ప‌టిదాకా తెలుగు సినిమా స్క్రీన్ మీద చూడ‌ని భారీత‌నం, అద్భుత క‌థాక‌థ‌నాల‌తో మ‌న ప్రేక్ష‌కుల‌ను సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి చేశాడు. ఇక బాహుబ‌లితో ఆయ‌న సృష్టించిన అద్భుతాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆ సినిమా నుంచే రాజమౌళి గొప్ప‌ద‌నాన్ని దేశం మొత్తం గుర్తించడం మొద‌లుపెట్టింది. ఆర్ఆర్ఆర్ చిత్రంతో రాజ‌మౌళి ప్ర‌తిభేంటో జేమ్స్ కామెరూన్ స‌హా హాలీవుడ్ లెజెండ‌రీ ఫిలిం మేక‌ర్స్‌కు సైతం తెలిసింది.

ప్ర‌స్తుతం వార‌ణాసి మూవీని గ్లోబ‌ల్ స్థాయిలో గొప్ప‌గా నిల‌బెట్టే ప్ర‌య‌త్నంలో ఉన్నాడు రాజ‌మౌళి. త‌న సినిమాల మేకింగ్‌లో రాజ‌మౌళి ఎంత క‌ష్ట‌ప‌డ‌తారో, ఆయ‌న క‌మిట్మెంట్ ఎలాంటిదో తెలిసిందే. ఆ విష‌య‌మై ఇప్పుడు వార‌ణాసి విల‌న్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ఇంట‌ర్వ్యూలో మాట్లాడాడు.

సెట్లో రాజ‌మౌళి అంత క‌ష్ట‌ప‌డే ఫిలిం మేక‌ర్‌ను తాను ఇంత వ‌ర‌కు చూడ‌లేద‌ని పృథ్వీరాజ్ చెప్పాడు. వార‌ణాసి షూటింగ్‌లో భాగంగా 7 గంట‌ల‌కు ఆర్టిస్టుల‌ను సెట్‌కు ర‌మ్మ‌ని ఆయ‌న చెబుతార‌ని.. తాను, మ‌హేష్‌, ప్రియాంక ఆ టైంకి అక్క‌డికి వెళ్తే మొత్తం షూట్ సెట‌ప్ రెడీగా ఉంటుంద‌ని.. అప్ప‌టికే ఆయ‌న త‌న టీం అంద‌రితో ప‌ది ప‌న్నెండుసార్లు రిహార్స‌ల్స్ చేసి ఉంటార‌ని.. మ‌రి ఆయ‌న ఎప్పుడు వ‌చ్చి ఇదంతా చేశాడా అని ఆశ్చ‌ర్యం క‌లుగుతుంద‌ని పృథ్వీరాజ్ వ్యాఖ్యానించాడు.

30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన ఇప్పుడే తొలి సినిమా తీస్తున్న కొత్త ద‌ర్శ‌కుడిలా త‌ప‌న ప‌డ‌తారు, క‌ష్ట‌ప‌డ‌తార‌ని పృథ్వీరాజ్ కొనియాడాడు.
వారణాసికి సంబంధించి ఒక సన్నివేశాన్ని తనకు వివరించినపుడు ఇంత కష్టమైన సీన్ ఎలా తీస్తారు అంటే తనకు తెలియదని రాజమౌళి అన్నాడని, కానీ షూటింగ్ చేసినపుడు మాత్రం సెట్లో అద్భుతంగా ఆ సీన్ చిత్రీకరించాడని పృథ్వీరాజ్ గుర్తు చేస్తున్నాడు.

ఇలాంటి ద‌ర్శ‌కుడితో ప‌ని చేయ‌డం అద్భుతమైన అనుభ‌వ‌మ‌ని పృథ్వీరాజ్ పేర్కొన్నాడు. వార‌ణాసిలో పృథ్వీరాజ్ కుంభ అనే పాత్ర‌లో మెయిన్ విల‌న్‌గా న‌టిస్తున్న సంగతి తెలిసిందే. రామాయ‌ణం ఎపిసోడ్లో ఆయ‌న కుంభ‌క‌ర్ణుడిగా క‌నిపించ‌నున్న‌ట్లు స‌మాచారం. వారణాసి వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

This post was last modified on June 25, 2026 4:06 am

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

6 hours ago