Political News

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. ఒక సాధారణ రైతుపై చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం జైలు పాలవగా, ఆయనకు శిక్ష పడే వరకు చెప్పులు ధరించనని శపథం చేసిన రైతు తన మొక్కు తీర్చుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. 2022 జనవరి 6న పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హాజరయ్యారు. ఆ సందర్భంగా ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని గ్రామానికి చెందిన రైతు గుడిపూడి నరేంద్ర ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన బ్రహ్మనాయుడు చెప్పు తీసి రైతుపై దాడి చేయడానికి ప్రయత్నించిన ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.

ఈ ఘటన అనంతరం రైతు నరేంద్రపైనే పోలీసులు కేసు నమోదు చేసి 11 రోజుల పాటు జైలుకు పంపారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన నరేంద్ర, తనను నలుగురిలో అవమానించిన ఎమ్మెల్యేకు శిక్ష పడే వరకు చెప్పులు ధరించబోనని తన ఇష్టదైవం వద్ద శపథం చేశాడు. అప్పటి నుంచి దాదాపు 40 నెలల పాటు ఆయన చెప్పులు లేకుండానే జీవనం సాగించాడు.

కాలక్రమేణా రాజకీయ పరిస్థితులు మారాయి. గత ఎన్నికల్లో బొల్లా బ్రహ్మనాయుడు ఓటమిపాలయ్యారు. అనంతరం తెలంగాణలో నమోదైన భూకబ్జా కేసులో ఆయన అరెస్టై ప్రస్తుతం జైలులో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే జైలుకు వెళ్లడంతో తన శపథం నెరవేరిందని భావించిన రైతు నరేంద్ర ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వేల్పూరు గ్రామం నుంచి మన్నేపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వరకు ఆయన పాదయాత్ర నిర్వహించి మొక్కు చెల్లించుకున్నారు. ఈ పాదయాత్రకు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి సంఘీభావం తెలిపారు. రైతు నరేంద్ర శపథం, దానిని నెరవేర్చుకున్న తీరు స్థానికంగా చర్చనీయాంశమైంది.

This post was last modified on June 18, 2026 9:21 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

6 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

6 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

6 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

6 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

8 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

10 hours ago