గత ఎన్నికల సమయంలో మంగళగిరిలోని ప్రతి వీధిలోనూ పర్యటించిన నారా లోకేష్.. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అదే.. మురుగునీటి సమస్య. చిన్న చినుకుపడ్డా.. నియోజకవర్గంలోని ప్రధాన రహదారులు సహా.. అన్ని ప్రాంతాలు.. కాలువలను తలపిస్తాయి. ఇక, మురగునీరుతో ప్రాంతాలుదుర్గంధం వెదజల్లు తుంటాయి. దీంతో స్థానికులు ఇబ్బందులు పడడమే కాకుండా.. అనారోగ్యాల పాలవుతున్నారు.
రెండుసార్లు.. ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల రామకృష్నారెడ్డి ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి కూడా దానిని అలానే వదిలేశారు. మంగళగిరి నియోజకవర్గం వ్యాప్తంగా బలమైన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే దీనికి కారణమని గుర్తించిన నారా లోకేష్.. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. మునిసిపల్ ఇంజనీర్లతో అధ్యయనం చేయించారు. భూగర్భ డ్రైనేజీని ఎక్కడ నుంచి ఎక్కడ వరకు నిర్మించాలన్న విషయంపై పక్కా ప్లాన్ తీసుకున్నారు.
తాజాగా దీనికి సంబంధించి.. భూమి పూజ పనులు చేపట్టారు. ప్రస్తుత అంచనాల ప్రకారం.. మంగళగిరి నియోజకవర్గంలోని 70 శాతం ప్రాంతంలో.. ఈ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కానుంది. తద్వారా.. స్థాని కంగా ఉత్పత్తి అయ్యే మురుగునీరుతోపాటు.. వర్షాల కారణంగా ఏర్పడే నీరు కూడా.. సులభంగా తరలి పోయేలా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. దీనికి తాజాగా భూమి పూజ చేసిన నారా లోకేష్.. మంగళగిరి వాసుల దశాబ్దాల సమస్యకు పరిష్కారం చూపించారు.
ప్రాజెక్టు డైమన్షన్స్ ఇవీ..
- మొత్తం వ్యయం: 1167 కోట్ల రూపాయలు.
- ప్రాజెక్టు పరిధి: మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్.
- నిధుల ఖర్చు: కేంద్రం 60%, రాష్ట్రం 40%
- పని పూర్తి: 531 కిలో మీటర్ల పరిధిలో రెండు దశలలో ఈ పనులు పూర్తి చేయనున్నారు.
- మురుగునీటిని శుద్ధికి 20 కేంద్రాలు ఏర్పాటు.
- 18 లిఫ్ట్ స్టేషన్ల ఏర్పాటు.
Gulte Telugu Telugu Political and Movie News Updates