ఏపీలో ప్ర‌భుత్వం మార‌దు: చంద్ర‌బాబు

ఏపీలో సుస్థిర ప్ర‌భుత్వం కొన‌సాగుతుంద‌ని.. మ‌ళ్లీ మ‌ళ్లీ ప్ర‌భుత్వం మారే ప‌రిస్థితి కూడా ఉండ‌ద‌ని సీఎం చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. ఆ విధంగా ప్ర‌జ‌లు కూడా ఆలోచ‌న చేస్తున్నార‌ని తెలిపారు. అభివృద్ధి-సం క్షేమం-సాంకేతిక‌తల‌కు ప్రాధాన్యం ఇస్తూ.. రాష్ట్రాన్ని పురోభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తున్నామ‌న్నా రు. యువ‌త‌కు పెద్ద ఎత్తున అవ‌కాశాలు క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు. త‌ద్వారా.. రాష్ట్రంలో ఒకే ప్ర‌భుత్వం కొన‌సాగేలా చూస్తున్నామ‌న్నారు. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి సందేహాలు అవ‌స‌రం లేద‌న్నారు.

సింగ‌పూర్‌లో ప‌ర్య‌టిస్తున్న సీఎం చంద్ర‌బాబు.. సోమ‌వారం ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా లీడర్ షిప్ ప్లీనరీ-2లో ‘కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్స్’(స్మార్ట్ న‌గ‌రాల ఆక‌ర్ష‌ణ‌) అనే అంశపై ప్రసంగించారు. ప్ర‌ధానంగా రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌మోట్ చేశారు. న‌గ‌రాల అభివృద్ది అంటే.. స‌మాజం అభివృద్ధి, రాష్ట్రాల అభివృద్ధి, దేశాల అభివృద్ధేన‌ని చంద్ర‌బాబు తెలిపారు. 25 ఏళ్ల క్రితం ఐటీ గురించి మాట్లాడాను. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్‌తో ఈ రోజు తెలుగువాళ్లు తలసరి ఆదాయంలో ముందు న్నారు. అని తెలిరారు.

రాష్ట్ర విభజనతో మరో నగరాన్ని నిర్మించే అవకాశం వచ్చిందని చంద్ర‌బాబు తెలిపారు. అమరావతిని గ్రీ న్ ఫీల్డ్ సిటీగా నిర్మిస్తున్నామ‌న్నారు. పీపుల్ ఫస్ట్(ప్ర‌జ‌లే ముందు) అనే విధానంతో భాగ‌స్వామ్యం, ప్ర‌కృతి, అవ‌కాశాలు, స‌హ‌జ‌ జీవ‌న న‌గ‌రంగా అమ‌రావ‌తిని నిర్మిస్తున్న‌ట్టు తెలిపారు. అంతర్జాతీయ మౌలిక వస తులతో, అవకాశాల వేదికగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామ‌న్నారు. కృష్ణానది, ఇన్నర్ – ఔటర్ రింగ్ రోడ్లు, ఐకానిక్ బ్రిడ్జిలతో అద్భుతంగా అమరావతి ప్ర‌పంచ ప‌టంలో ఒక గుర్తింపు తెచ్చుకుంటుంద‌ని పేర్కొన్నారు.

అవే కాకుండా.. స్పోర్ట్స్, ఫైనాన్సియల్, నాలెడ్జ్, జస్టిస్, టూరిజం, హెల్త్, మీడియా వంటి కాన్సెప్ట్స్ తీసుకున్నామ‌న్నారు. ఒకే ఒక్క పిలుపుతో రాజధాని కోసం రైతులు 35 వేల ఎకరాలను అప్పగించారని, వారికి రాజ‌ధానిలోనే కొంత భాగాన్ని అభివృద్ధి చేసి రైతులకు తిరిగి ప్లాట్లు ఇస్తున్నామ‌ని తెలిపారు. 21 కిలో మీట‌ర్ల‌ పొడవున… వాటర్ ఫ్రంట్ నగరంగా అమరావతి ఉంటుందని తెలిపారు. సైక్లింగ్, వాకింగ్ ట్రాక్, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్, అండర్ గ్రౌండ్ యుటిలిటీస్, గ్రీన్ ఎనర్జీ, నెట్ జీరో లక్ష్యంగా రాజధాని నిర్మాణం జరుగుతోందని వివ‌రించారు.