బలమైన మూడు నియోజకవర్గాలలో వైసీపీ జెండా ఎగరడం లేదా? అసలు ఆరెండు స్థానాలను కీలకంగా తీసుకుని వైసీపీ చేసిన ప్రయత్నాలు, ప్రయోగాలు ఫలించడం లేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఆ మూడు నియోజకవర్గాలు గెలిస్తే.. చాలా పెద్ద ఎత్తున విజయం దక్కించుకున్నట్టేనన్న అభిప్రాయం పార్టీవర్గాల్లో ఉండేది. కానీ, గత ఎన్నికల్లో ఆ మూడు చోట్లా పరాజయం పాలయ్యారు. పోనీ.. ఇప్పుడైనాపట్టు బిగించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారా? అంటే.. లేదనే సమాధానమే వినిపిస్తోంది.
1) కుప్పం: సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ పెద్ద ఎత్తున అధికారంలో ఉన్నప్పుడు.. గెలుపు గుర్రం ఎక్కేందుకు ప్రయత్నించింది. ప్రత్యర్థి నాయకుడి నియోజకవర్గమే అయినా.. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఏనియోజకవర్గంలోనూ జరగని అభివృద్ధి చేశారు. ఏకంగా ఎంపీ, మంత్రులు ఇక్కడే తిష్ఠ వేసి.. అప్పట్లో రాజకీయాలు చేశారు. కానీ, పలితం దక్కలేదు. పైగా.. గత ఎన్నికల్లో ఓడిపోయిన భరత్.. ఇప్పటి వరకు అజా లేకుండా పోయారు. ప్రస్తుతం ఇక్కడ జెండా కట్టేవారే కరువయ్యారు.
2) మంగళగిరి: ఇది కూడా వైసీపీకి అత్యంత కీలకమైన నియోజకవర్గం. మంత్రినారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఆయనను ఓడించాలని 2024 ఎన్నికల్లో చేయని ప్రయత్నం, ప్రయోగం లేదు. కానీ, నారా నందమూరి ఫ్యామిలీలు..ఇక్కడ పెద్ద ఎత్తున ఇంటింటికీ తిరగడం, వైసీపీలో పుట్టిన ముసలం కారణంగా.. పార్టీ వోడిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే.. వైసీపీలో ఉన్న మాజీ మంత్రి ఒకరు టీడీపీకి అనుకూలంగా స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన నాయకురాలు కూడా కనిపించడం లేదు.
3) పిఠాపురం: జనసేన అధినేత డిప్యూటీ సీఎంపవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇక్కడ కూడా.. విజయం సాధించి.. పవన్‌ను మరోసారి ఓడించాలని గత ఎన్నికల సమయంలో వైసీపీ చేసిన ప్రయత్నాలు .. విఫలమయ్యాయి. వంగా గీతావిశ్వనాథ్‌ను తీసుకువచ్చి.. ఇక్కడ నిలబెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుతం ఇక్కడ కూడా.. వైసీపీ జాడలు కనిపించడం లేదు. గత ఎన్నికల సమయంలో పార్టీలో ఉన్న కీలక నేత.. దొరబాబు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో వైసీపీ తరఫున వాయిస్ వినిపించేవారు.. కనిపించేవారు కూడా కరువయ్యారు.
This post was last modified on May 27, 2026 5:04 am
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…