Political News

దేశంలో బాబు `కీ`ల‌క రోల్ ..!

దేశంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు గురించి తెలియని వారు లేరు. విజ‌న్ ఉన్న ముఖ్య‌మంత్రిగానే కాకుండా.. 75 ఏళ్ల వ‌య‌సులో కూడా ఆయ‌న చాలా యాక్టివ్‌గా 25 ఏళ్ల న‌వ‌యుకుడిలా ఛెంగు ఛెంగున కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. దాదాపు రెండు నుంచి 3 గంట‌ల‌పాటు నిల‌బ‌డే కార్య‌క్ర‌మాల్లో ప్ర‌సంగాలు కూడా దంచి కొడుతున్నారు. దీంతో చంద్ర‌బాబు స్టామినా గురించి.. త‌ర‌చుగా జాతీయ మీడియాలోనూ చ‌ర్చ న‌డుస్తోంది. ఇక‌, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల జాబితాలోనూ చంద్ర‌బాబు ముందున్నారు.

ఆయ‌న దూకుడు అంతా ఇంతాకాదు. భ‌విష్య‌త్తును ముందు గానే అంచ‌నా వేసుకుని దాని ప్ర‌కారం నిర్ణ‌యాలు తీసుకుంటారు. ఈ క్ర‌మంలోనే గ‌తంలోనే ప్ర‌ధాని స‌హా.. అనేక మంది జాతీయ నాయ‌కులు చంద్ర‌బాబు సేవ‌ల‌ను వినియోగించుకున్నారు. 2016లో దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో చంద్ర‌బాబు నేతృత్వంలోనే మోడీ క‌మిటీని వేశారు. దేశంలో త‌ర్వాత తీసుకురా వాల్సిన మార్పుల‌పై ఈ క‌మిటీ అధ్య‌యనం చేసింది.

ఈ క‌మిటీకి చంద్ర‌బాబు నేతృత్వం వ‌హించారు. ప్ర‌స్తుతం డిజిట‌ల్ ట్రాన్సాక్షాన్స్‌.. స‌హా.. యూపీఐ సేవల‌ను మ‌రింత విస్త‌రించేందుకు నాడు ఈ క‌మిటీనే స‌ల‌హాలు సూచ‌న‌లు ఇచ్చింద‌ని.. ఇటీవ‌ల కేంద్ర ఆర్థిక మంత్రి సైతం వివ‌రించారు. కాగా.. ఇప్పుడు మ‌రోసారి చంద్ర‌బాబుకు మంచి అవ‌కాశం చిక్కింది. దేశంలోని అన్ని పార్టీల‌ను.. ముఖ్యంగా.. ఎన్డీయేత‌ర పార్టీల‌ను ఐక్యంగా ముందుకు న‌డిపించేందుకు.. ఒకే తాటిపైకి తీసుకువ‌చ్చేందుకు కేంద్రం ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ప్ర‌ధానంగా.. పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న విష‌యంలో కాంగ్రెస్ స‌హా.. ఇత‌ర ఎన్డీయేత‌ర పార్టీలు వ్య‌తిరేకిస్తున్నాయి. గత నెల‌లో జ‌రిగిన పార్ల‌మెంటు స‌మావేశాల్లో ఈ బిల్లు వీగిపోయింది. అయితే.. జూన్- జూలై మ‌ధ్య కాలంలో జ‌రిగే స‌భ‌ల్లో.. ఈ బిల్లును ఆమోదించాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది.

అయితే .. ప్రత్యర్థి పార్టీల‌ను ఒప్పించ‌డం.. అంద‌రినీ ఏక‌తాటిపైకి తీసుకురావ‌డం.. అనే ప్ర‌ధాన క్ర‌తువును చంద్ర‌బాబుకే అప్ప‌గించాల‌ని ప్ర‌ధాని నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది. ఇదే జ‌రిగితే.. చంద్ర‌బాబు నేతృత్వంలో పార్టీలు ఏక‌తాటిపైకి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. త‌ద్వారా ప్ర‌ధాన కార్య‌క్ర‌మం నిర్విఘ్నంగా జ‌రుగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

This post was last modified on May 24, 2026 9:48 pm

Share

Recent Posts

సూర్య‌తో సినిమా ఎప్పుడు… రాజ‌మౌళి జ‌వాబేంటి?

రాజ‌మౌళితో సినిమా చేయాల‌ని ఇప్పుడు ఇండియాలో ఉన్న‌ ప్ర‌తి పేరున్న హీరో ఆశ‌ప‌డుతుంటాడు అన‌డంలో సందేహం లేదు. ఐతే రాజ‌మౌళి…

27 minutes ago

`వ‌ర్గాల‌`కు దూర‌మ‌వుతున్న వైసీపీ.. ?

రాష్ట్ర రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌తో వైరం ఎలా ఉన్నా.. ప్ర‌జ‌ల‌తో మాత్రం పార్టీల‌కు సాన్నిహిత్యం ఉండాలి. అది కొర‌వ‌డితే.. ఎప్పటికీ చేరువ…

1 hour ago

నాని సినిమాలో ఆ పార్ట్… ద‌ర్శ‌కుడికీ న‌చ్చ‌లేద‌ట‌

నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్లో ప్ర‌త్యేకంగా చెప్పుకోద‌గ్గ చిత్రాల్లో శ్యామ్ సింగ‌రాయ్ ఒక‌టి. ట్యాక్సీవాలాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన రాహుల్…

2 hours ago

నాని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు

పెద్ద బ‌డ్జెట్ పెట్టి, చాలా కాలం క‌ష్ట‌ప‌డి, ఎన్నో ఆశ‌ల‌తో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వ‌స్తే త‌ట్టుకోవ‌డం తేలిక…

2 hours ago

అమ‌రావతికి పంచ సూత్రాలు… చంద్ర‌బాబు భారీ ప్లాన్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో అత్యంత శ్ర‌ద్ధ చూపిస్తున్న విష‌యం తెలిసిందే. రైతుల నుంచి భూములు స‌మీక‌రించ‌డం(పూలింగ్‌)…

3 hours ago

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

8 hours ago