రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో మాజీ ఎంపీ.. గల్లా జయదేవ్ పేరు టీడీపీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ప్రత్యక్ష రాజకీయాలనుంచి స్వచ్ఛందంగా తప్పుకొన్న ఆయన.. తిరిగి నామినేటెడ్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన గల్లా.. గత ఎన్నికల్లో గుంటూరు ఎంపీ స్థానాన్ని వదులుకున్నారు. వాస్తవానికి వైసీపీ గాలి జోరుగా వీచిన సమయంలో కూడా.. ఆయన విజయం దక్కించుకున్నారు.
మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కుమారుడిగానే రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటికీ.. గుంటూరు ఎంపీగా తొలిసారి 2014లో విజయం దక్కించుకున్నాక.. తనదైన శైలిలో గల్లా రాజకీయాలు చేశారు. ఫలితంగా.. రెండోసారి భారీ పోటీ సహా.. జగన్ హవా ఉన్నప్పటికీ.. ఆయన దిగ్విజయంగా గెలుపు గుర్రం ఎక్కారు. ఇక, కారణాలు ఏవైనా కూడా.. తన వ్యాపారం కోసం.. రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించి.. గత ఎన్నికల్లో పోటీకిదూరంగా ఉన్నారు.
కానీ.. రాజకీయంగా మాత్రం టీడీపీకి టచ్‌లోనే ఉన్నారు. తరచుగా ఢిల్లీలో ప్రత్యక్షం అవుతున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ గల్లా అక్కడ కనిపిస్తున్నారు. ఇక, ఇప్పుడు తాజాగా రాజ్యసభ స్థానాలకుషెడ్యూల్ ప్రకటించిన దరిమిలా.. ఆయన పేరు ప్రముఖంగా తెరమీదికి వచ్చింది. తనకు అవకాశం ఇవ్వాలని ఆయన చంద్రబాబుకు విజ్ఞప్తి చేయడంతోపాటు.. తనకు ఉన్న ఛానెళ్ల నుంచి కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
గల్లా జయదేవ్‌ను పార్టీపరంగా వినియోగించుకునేందుకు ఇబ్బందిలేదు. అయితే.. ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్న దరిమిలా.. ఆయనకు మరో చాన్స్ ఇస్తరా? అనేదిప్రశ్న. అయితే.. ఏమైనా జరగొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు దృష్టిలో క్లీన్ లీడర్‌గా గుర్తింపు పొందిన గల్లాకు రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా.. ఎలాంటి సంకేతాలు వస్తాయన్న అంచనాలు వేస్తున్నారు. మరి ఈయన ప్రయత్నం సాగుతుందా? సఫలం అవుతుందా? అనేది చూడాలి.
This post was last modified on May 23, 2026 3:00 pm
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…