Movie News

అనిరుధ్, కావ్య పెళ్లి… ఈసారైనా నిజమేనా?

తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వ్యక్తిగత జీవితం గురించి తరచుగా వార్తలు వస్తుంటాయి. సంగీత దర్శకుడిగా ప్రయాణం ఆరంభించిన కొత్తలోనే ఒక నటి, సింగర్‌తో తన ప్రేమాయణం చర్చనీయాంశంగా మారింది. తర్వాత కీర్తి సురేష్‌తో తన పెళ్లి అంటూ ఒక దశలో చర్చ జరిగింది. ఇది ఫేక్ న్యూస్ అని తర్వాత వెల్లడైంది. ఐతే ఏడాదిగా అతడి పెళ్లి గురించి కొత్త వార్తలు వస్తున్నాయి.

సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ తనయురాలు కావ్య మారన్‌తో అనిరుధ్ ప్రేమలో ఉన్నట్లు.. వీరి పెళ్లి జరగబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాదే వీరి వివాహం గురించి వార్తలు వచ్చాయి. కానీ అవి నిజం కాలేదు. కానీ ఇప్పుడు మళ్లీ ఆ ప్రచారం ఊపందుకుంది. అనిరుధ్, కావ్యల వివాహానికి ముహూర్తం ఖరారైందని.. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగబోతోందని మీడియాలో, సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి.

సూపర్ స్టార్ రజినీకాంత్ భార్య లత సోదరుడైన రవిచందర్ తనయుడే అనిరుధ్. ఇటు రవిచందర్, అటు రజినీకాంత్ కుటుంబాలతో మారన్ ఫ్యామిలీ పెళ్లి విషయంలో ఒక అవగాహనకు వచ్చిందని.. కుటుంబ సభ్యులు, ముఖ్యమైన బంధువులు, సన్నిహితుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుని.. ఆ తర్వాత చెన్నైలో గ్రాండ్‌గా రిసెప్షన్ పెట్టాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయని మీడియా రిపోర్ట్ చేస్తోంది.

సన్ గ్రూప్‌కు పలు వ్యాపారాలుండగా కావ్య.. ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ వ్యవహారాలను తనే చేసుకుంటోంది. 18 ఏళ్ల వయసులోనే ‘3’ మూవీతో సంగీత దర్శకుడిగా సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన అనిరుధ్.. ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అతను ప్రస్తుతం డబుల్ డిజిట్ ఫిగర్‌ను పారితోషకంగా తీసుకుంటున్నాడు. ఈ ఏడాది ప్యారడైజ్, జైలర్-2 లాంటి సెన్సేషనల్ మూవీస్ అతడి నుంచి రాబోతున్నాయి.

This post was last modified on May 24, 2026 6:07 am

Share

Recent Posts

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

6 minutes ago

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

4 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

5 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

5 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

5 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

6 hours ago