Political News

అమ‌రావ‌తికి సొమ్ములిస్తే నేర‌మా… జ‌గ‌న్‌?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని వ్య‌తిరేకిస్తున్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న చేశారు. అది విఫ‌ల‌మైంది. ఇక‌, ఇటీవ‌ల రాజ‌ధానికి చ‌ట్ట బ‌ద్ధ‌త క‌ల్పించే బిల్లును పాస్ చేసిన‌ప్పుడు.. మావిగ‌న్‌ పేరుతో చేసిన ప్ర‌తిపాద‌న కూడా బెడిసి కొట్టి న‌వ్వుల పాలైంది. మొత్తంగా.. జ‌గ‌న్ ఏమ‌నుకున్నా.. ప్ర‌జ‌లు మాత్రం అమ‌రావ‌తిని కోరుకుంటున్నారు. కానీ, ఈ విష‌యాన్ని జ‌గ‌న్ గ్ర‌హించ‌లేక పోతున్నారో.. లేక ,ఆయ‌న ఎవ‌రో చెప్పిన మాట‌ల‌నే ఇంకా వంట‌బ‌ట్టించుకుంటున్నారో తెలియ‌డం లేదు. కానీ.. అమ‌రావ‌తిపై ఇంకా యాగీనే చేస్తున్నారు.

నిజానికి తాను కావాల‌ని అనుకున్న చ‌ట్టాల‌ను.. రైతులు వ్య‌తిరేకించిన‌ప్పుడు.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీనే వెన‌క్కి త‌గ్గారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను తీసుకువ‌చ్చిన‌ప్పుడు.. దేశ‌వ్యాప్తంగా రైతులు వ్య‌తిరేకించారు. దీంతో కొన్నాళ్లు వేచి చూసి.. ఆత‌ర్వాత ఆయ‌నే వాటిని హుందాగా వెన‌క్కి తీసుకున్నారు. కానీ, తాను ప‌ట్టిన కుందేలుకు మూడు కాళ్లేన‌ని వాదించే జ‌గ‌న్‌.. మాత్రం ఇప్పటికీ.. అనేక దెబ్బ‌లు తిన్నాక కూడా.. అమ‌రావ‌తిపై ఇంకా త‌న అక్క‌సును వెళ్ల‌గ‌క్కుతూనే ఉన్నార‌న్న చ‌ర్చ జోరుగా సాగుతోంది. తాజాగా అమ‌రావ‌తికి రాష్ట్ర ప్ర‌భుత్వం నిధులు ఇవ్వ‌డాన్ని త‌ప్పుబ‌డుతూ.. త‌న మీడియాలో క‌థ‌నాలు రాయించారు.

వాస్త‌వానికి అమ‌రావ‌తి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టే అయినా.. కొంత మేర‌కు పెట్టుబ‌డులు పెట్టాలిక‌దా..? అనే చిన్న లాజిక్‌ను జ‌గ‌న్ మ‌రిచిపోతున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. దీంతో ప్ర‌భుత్వం దుబారా చేస్తోంద‌ని.. అమ‌రావ‌తికి ప్ర‌జ‌ల ధ‌నాన్ని ధార పోస్తోంద‌ని పేర్కొంటూ.. త‌న ఆవేద‌న‌ను రాష్ట్ర ఆవేద‌న‌గా మార్చే ప్ర‌య‌త్నం చేశారు. నిజానికి అమ‌రావ‌తికి రాష్ట్ర ప్ర‌భుత్వం వేల కోట్లేమీ ధార పోయ‌డం లేదు. కేంద్ర స‌హ‌కారంతో ప్ర‌పంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి నిధులు తీసుకుని.. డెవ‌ల‌ప్ చేస్తోంది. అదేస‌మ‌యంలో చిన్న చిత‌కా ప‌నుల‌కు మాత్ర‌మే రాష్ట్ర బ‌డ్జెట్‌నుంచి కొంత మేర‌కు నిధులు ఇస్తోంది.

ఇలా.. తాజాగా 2000 కోట్ల‌ను మాత్ర‌మే ప్ర‌భుత్వం కేటాయించింది. ఇవి కూడా.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, న్యాయాధికారుల భ‌వ‌నాల‌కు ఫినిషింగ్ ప‌నుల‌కు ఇచ్చిన‌ట్టు సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. దీనిలో త‌ప్పేముంది.

పైగా.. ఇచ్చిన సొమ్మును కూడా దొడ్డిదారిలో ఏమీ ఇవ్వ‌లేదు. నేరుగా ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచే చెల్లించారు. రాజ‌ధానిలో ఈ నిర్మాణాలు ఇప్ప‌టికే పూర్త‌య్యాయి. వ‌చ్చే శ్రావ‌ణ మాసం నుంచి న్యాయ‌మూర్తులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. అక్క‌డే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఫినిషింగ్ ప‌నుల‌కు కేటాయించిన సొమ్ముపైనా జ‌గ‌న్ రాద్ధాంతం చేస్తున్నార‌ని.. టీడీపీ నాయ‌కులు దుయ్య‌బ‌డుతున్నారు.

This post was last modified on May 21, 2026 10:12 pm

Share

Recent Posts

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

16 minutes ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

23 minutes ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

27 minutes ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

49 minutes ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

1 hour ago

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

2 hours ago