వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాగంగా పలు కీలక అంశాలను ప్రస్తావించిన జగన్… చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మావిగన్ పేరు వింటే చంద్రబాబు గుండె ఆగి చనిపోతాడు అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ లాంటి నేత నోట నుంచి ఈ తరహా వ్యాఖ్యలు వినిపించడం నిజంగానే దారుణమని చెప్పాలి. గతంలోనూ చంద్రబాబు శాపం తగిలి పోతారంటూ శాపనార్థాలు పెట్లిన జగన్… ఈ దఫా ఏకంగా చంద్రబాబు ఏకంగా చనిపోతారంటూ వ్యాఖ్యానించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
మావిగన్ పై మీ స్పందన ఏమిటని అడిగితే.. చంద్రబాబు గుండె ఆగి చనిపోతాడు అని జగన్ వ్యాఖ్యానించారు. నిద్దట్లో మావిగన్ గుర్తుకు వచ్చినా చంద్రబాబుకు బీపీ పెరిగిపోతుందని ఆయన అన్నారు. మావిగన్ పై మీ స్పందన ఏమిటని అడిగితే… గుండె ఆగి చనిపోకపోతే అదృష్టం అని జగన్ వ్యాఖ్యానించారు.
రాజకీయాలు అన్నాక వైరి వర్గాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమేనని చెప్పాలి. అయితే వైరి వర్గాలకు చెందిన కీలక నేతలు చనిపోవాలన్న రీతిలో ఆయా నేతలు వ్యాఖ్యలు చేయడం ఇప్పటిదాకా జరగలేదనే చెప్పాలి. అయితే సీఎం పదవి చేజారిన నేపథ్యంలో జగన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబుపై శాపనార్ధాలు పెడుతున్నారన్న కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
This post was last modified on May 21, 2026 1:32 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…