Political News

‘గొడ్డలి పార్టీ’ వ్యాఖ్యలకు జగన్ ఇంతలా ట్రిగ్గర్ అయ్యారా?

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం తాడేపల్లిలోని తన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జగన్ తన పాత పాటను పాడినట్టే అన్నీ పాత విషయాలే చెప్పుకొచ్చారు. అయితే కొత్తగా కొన్ని అంశాలను ఆయన ప్రస్తావించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. గొడ్డలి పార్టీ ఎవరిది? అని ప్రశ్నించిన జగన్… గన్ కల్చర్ ఎవరిది? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

గొడ్డలి పార్టీ ఎవరిది అని ప్రశ్నించిన జగన్… తన కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారని తెలిపారు. తన తాత రాజా రెడ్డిని చంపింది ఎవరని ప్రశ్నించిన జగన్… తన తాతను హత్య చేసింది టీడీపీ వారే కదా అని అన్నారు. ఈ హత్య చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే జరిగిందని తెలిపారు. ఇక తన బాబాయి వివేకానందరెడ్డి హత్య కూడా చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే జరిగిందన్న విషయాన్ని జగన్ ప్రస్తావించారు. బాదితులమైన తమపైనే చంద్రబాబు నిందారోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఇక తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయిన అంశాన్ని ప్రస్తావించిన జగన్… ఈ ఘటన వెనుక కూడా చంద్రబాబు హస్తం ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. నాడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండగా… అసెంబ్లీ సాక్షిగా రాజశేఖరరెడ్డి అసెంబ్లీకి ఎలా వస్తారో చూస్తానని చంద్రబాబు అన్నారని… చంద్రబాబు నోట ఈ మాటలు వచ్చిన మూడు, నాలుగు రోజులకే రాజశేఖరరెడ్డి చనిపోయారని ఆయన అన్నారు.

ఇక గన్ కల్చర్ పార్టీ అంటూ వైసీపీని తూలనాడుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించిన జగన్… అసలు గన్ కల్చర్ ఎవరిది అని ప్రశ్నించారు. చంద్రబాబు బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే తుపాకీ తీసుకుని ఇద్దరు వ్యక్తులపైకి కాల్పులు జరపలేదా? అని ప్రశ్నించిన జగన్…ఆ కాల్పులు ఇద్దరు వ్యక్తులు లేసిపోలేదా? అని ప్రశ్నించారు. గన్ లను ఇస్టానుసారంగా వాడే వారున్న పార్టీ టీడీపీ అని… గన్ కల్చర్ కలిగిన పార్టీ టీడీపీనేనని జగన్ ఆరోపించారు.

This post was last modified on May 21, 2026 1:07 pm

Share

Recent Posts

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

18 minutes ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

26 minutes ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

30 minutes ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

51 minutes ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

1 hour ago

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

2 hours ago