Political News

పిఠాపురం వర్మకు పవన్ లేఖ?

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేరుతో రూపొందించిన ఓ ఫేక్‌ లెటర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మకు పవన్‌ కల్యాణ్‌ ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా ఈ లేఖను సృష్టించారు.

ఈ లేఖలో.. “2024 ఎన్నికల్లో వర్మ గారు అందించిన సహకారం మరువలేనిది” అంటూ పేర్కొన్నారు. అలాగే పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నానని తెలిసిన వెంటనే బలమైన క్యాడర్‌ ఉన్నప్పటికీ వర్మ తన సీటును త్యాగం చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించారని, ఆయనకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని లేఖలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

భవిష్యత్తులో వర్మ చట్టసభల్లో అడుగుపెట్టి ప్రజల తరఫున బలంగా పనిచేస్తారనే నమ్మకం వ్యక్తం చేస్తూ.. పిఠాపురం అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని కూడా ఆ లేఖలో పేర్కొన్నట్లు కనిపిస్తోంది.

అయితే ఈ లేఖ పూర్తిగా నకిలీదేనని జనసేన వర్గాలు చెబుతున్నాయి. డీసీఎం కార్యాలయం నుంచి ఇలాంటి ఎలాంటి అధికారిక లేఖ విడుదల కాలేదని స్పష్టం చేస్తున్నాయి. ఈ ఫేక్‌ లెటర్‌ను ఎవరు రూపొందించారు? ఏ ఉద్దేశంతో వైరల్‌ చేస్తున్నారు? అన్న దానిపై జనసేన నాయకత్వం ఆరా తీస్తోంది. మరోవైపు పిఠాపురం టీడీపీ వాట్సాప్‌ గ్రూపుల్లో ఈ లేఖ విస్తృతంగా షేర్‌ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

This post was last modified on May 15, 2026 10:19 pm

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

6 hours ago