కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మే 8న పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం భగీరథ్ పరారీలో ఉన్నారని, ముమ్మరంగా గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అదే సమయంలో ఈ రోజు భగీరథ్ పోలీసు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులిచ్చారు. వాస్తవారిని ఆ నోటీసులు బండి సంజయ్ నివాసంలో ఇవ్వాల్సి ఉంది.
కానీ, అందుకు భిన్నంగా సంజయ్ బావమరిది ఇంటికి వెళ్లి నోటీసులిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అంటే, భగీరథ్ ఆ ఇంట్లో ఉన్నారా అంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో భగీరథ్ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
అయితే, భగీరథ్ విచారణకు గైర్హాజరవుతారు అన్నది ఊహించినదే. కానీ, అక్కడ విచారణ చేయాల్సిన సిట్ బృందంలోని పోలీసు అధికారులు కూడా స్టేషన్ కు రాలేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అంటే, భగీరథ్ రాడని పోలీసులకు ముందస్తు సమాచారం ఉందంటూ కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ నాయకులకు, సామాన్యులకు వేర్వేరుగా న్యాయం జరుగుతోందంటూ విమర్శిస్తున్నారు. ఇదే ఒక సామాన్యుడిపై పోక్సో కేసు నమోదై ఉంటే ఈ పాటికి అరెస్టు చేసి ముప్పుతిప్పలు పెట్టేవారని పోలీసుల తీరును కూడా చాలామంది నెటిజనులు తప్పుబడుతున్నారు.
This post was last modified on May 13, 2026 4:30 pm
నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…
సరైనోడు ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శీను కాంబోలో ఒక సినిమా తెరకెక్కే అవకాశముందంటూ నిన్న…
ఒకప్పుడు ఆస్కార్ అవార్డుల గురించి ఇండియన్ ఫిలిం మేకర్స్ ఆలోచించడం కూడా కష్టంగా ఉండేది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత…
మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు…
కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని అనుకునేవారు.. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య చాలా ఏళ్ల…