Political News

తప్పు త్వరగా తెలుసుకున్న సీఎం విజయ్

టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో మద్యం షాపులు తీసివేయాలన్న విజయ్ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇక, బ్యానర్లు, ఫ్లెక్సీలు అంటూ ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు చేయొద్దంటూ టీవీకే ఎమ్మెల్యేలకు హుకుం జారీ చేసిన విజయ్ రీల్ లైఫ్ మాదిరే రియల్ లైఫ్ లో పాలన సాగిస్తారని అంతా భావించారు.

అయితే, తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రిక్కి రాధన్ ను తన ఓఎస్డీగా నియమించడంతో విజయ్ పై తొలి విమర్శ మొదలైంది. ఇక, నేడు అసెంబ్లీలో అయితే ఈ విషయంపై డీఎంకేతో పాటు టీవీకే మిత్రపక్షాలు కూడా విజయ్ తీరును తప్పుబట్టాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓఎస్డీగా రిక్కి రాధన్ నియామకాన్ని రద్దు చేశారు. విపక్షాల ఆరోపణలతో వెనక్కి తగ్గిన సీఎం విజయ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇటు విపక్షాలు, అటు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో విజయ్ చాలా వేగంగా రియాక్ట్ అయ్యి చేసిన పొరపాటును సరిదిద్దుకున్నారు. ఈ విషయంలో విజయ్ తీరు అభినందనీయం.

రిక్కి రాధన్ విషయంలో పడ్డ మచ్చ మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు అన్న విషయం విజయ్ గుర్తు పెట్టుకోవాలి. అయితే, ఇటువంటి పొరపాట్లు మళ్లీ రిపీట్ కాకుండా విజయ్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఏది ఏమైనా రిక్కీ రాధన్ నియామకం రద్దు రూపంలో విజయ్ కు తొలి షాక్ తగిలినట్లయింది.

This post was last modified on May 13, 2026 7:45 pm

Share

Recent Posts

మరో విమానంలో సీరియస్ సిగ్నల్స్

విమానాలు భయపెడుతున్నాయి. గత వారం ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కో పైలట్ ప్రయత్నం చేయడం ప్రపంచ వ్యాప్తంగా వార్తయ్యింది.…

7 hours ago

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

10 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

11 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

11 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

13 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

15 hours ago