Political News

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో వింత పరిణామం చోటుచేసుకుంటూ ఉన్నాయి. తాజాగా విజయ్ తన ప్రభుత్వ బల పరీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో మద్రాస్ హైకోర్టు ఓ కీలక ఆదేశాన్ని జారీ చేసింది.

విజయ్ పార్టీ టీవీకే తరఫున ఒక్క ఓటుతో విజయం సాధించిన ఎమ్మెల్యే అసెంబ్లీలో జరిగే విశ్వాస పరీక్షలో పాల్గొనరాదంటూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. అసలే విజయ్ సర్కారుకు అంతంత మెజారిటీ ఉన్న నేపథ్యంలో కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

హైకోర్టు తీర్పునకు దారి తీసిన పరిణామాల్లోకి వెళితే.. శివగంగై జిల్లా తిరుపత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీవీకే అభ్యర్థిగా బరిలోకి దిగిన శ్రీనివాస సేతుపతి విజయం సాధించారు. డీఎంకే తరఫున అక్కడ బరిలోకి దిగిన తాజా మాజీ మంత్రి, సీనియర్ రాజకీయవేత్త పెరియ కరుప్పన్ పై ఆయన ఒక్కటంటే ఒక్క ఓటుతో విజయం సాధించారు.

కరుప్పన్ కు 83,374 ఓట్లు రాగా సేతుపతికి 83,735 ఓట్లు వచ్చాయి. దీంతో సేతుపతి విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఆ పత్రం పట్టుకుని అసెంబ్లీకి వెళ్లిన సేతుపతి ఎమ్మెల్యేగా కూడా ప్రమాణం చేశారు.

అయితే సేతుపతి విజయంపైనా, ఓట్ల లెక్కింపుపైనా కరుప్పన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో పొరపాటు జరిగిందని కరుప్పన్ ఆరోపించారు. అంతేకాకుండా మొత్తంగా ఓట్ల లెక్కింపే సవ్యంగా జరగలేదని కూడా ఆయన ఆరోపించారు.

ఆరోపణలతో సరిపెట్టని కరుప్పన్… మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కరుప్పన్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు… విజయ్ సర్కారు బల పరీక్షలో సేతుపతి పాల్గొనరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఫలితంగా ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ…సేతుపతి తన పార్టీ ప్రభుత్వ విశ్వాస పరీక్షకు దూరంగా ఉండాల్సి వస్తోంది.

విజయ్ సర్కారుకు ఇప్పుడు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. తాజాగా మంగళవారం అన్నాడీఎంకేకు చెందిన చీలిక వర్గం 30 మంది ఎమ్మెల్యేలతో మద్దతు ప్రకటించింది. ఈ మద్దతును ఇప్పటిదాకా విజయ్ అయితే స్వీకరించలేదు.

ఇలాంటి నేపథ్యంలో విశ్వాసన పరీక్షలో సేతుపతి దూరంగా ఉంటే… విజయ్ సర్కారుకు కేవలం 119 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఈ మద్దతు సరిపోయినా… అనుకోని కారణాల వల్ల ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా కొడితే విజయ్ సర్కారు కుప్పకూలడం ఖాయమే. మరి ఇలాంటి కీలక పరిస్థితుల్లో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై తమిళనాట ఆసక్తికర చర్చ నడుస్తోంది.

This post was last modified on May 12, 2026 4:05 pm

Share

Recent Posts

థియేటర్లలో వావ్… ఇప్పుడు వామ్మో

కొన్ని సినిమాలు థియేటర్లలో సరిగా ఆడవు. వాటిని ఓటీటీలో చూసినపుడు ఇలాంటి చిత్రాలను ఎలా ఫ్లాప్ చేశారు అంటూ ఆశ్చర్యపోతుంటారు…

51 minutes ago

పిఠాపురంలో ఎవ్వ‌రికి ఛాన్స్ లేద‌బ్బా.. !

సామాజికంగా.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ప‌రంగా.. నాయ‌కులు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో పాగా వేసేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కొక్క‌…

3 hours ago

కూట‌మి కాన్ఫిడెన్స్ ఏంటి?

వ‌చ్చే ఎన్నికల్లోనూ కూట‌మి విజ‌యం సాధిస్తుంద‌న్న బ‌ల‌మైన సంకేతాలు వ‌స్తున్నాయి. నాయ‌కులు చెప్ప‌డ‌మే కాదు.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న కొన్ని ఆన్‌లైన్…

3 hours ago

రవితేజ పోటీని యష్ తట్టుకోవాలంటే

ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…

3 hours ago

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

4 hours ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

5 hours ago