కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త అంశం బయటకు వస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా యథేచ్ఛగా సాగిన ఈ దందాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ బాబాయి, టీటీడీ మాజీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి హస్తం ఉన్నట్లుగా ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరుగాంచిన వైసీపీ కీలక నేతలు, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిల పాత్ ఉన్నట్లుగా తాజాగా వెల్లడైంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ సర్కారు ఏర్పాటు చేసిన దినేశ్ కుమార్ కమిషన్ నివేదిక ఈ కొత్త విషయాన్ని వెల్లడించింది.
భూమన కరుణాకర రెడ్డి తిరుపతి ఎమ్మెల్యేగా వ్యవహరించారు. అంతేకాకుండా ఆయన టీటీడీ చైర్మన్ గానూ పనిచేశారు. ఇక చెవిరెడ్డి భాస్కరరెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యేగా కొనసాగిన సంగతి తెలిసిందే. తిరుమలకు సంబంధించిన ఆయా వస్తువుల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో వీరిద్దరూ సభ్యులుగా కొనసాగారట.
కమిటీకి కన్వీనర్ గా టీటీడీ ప్రొక్యూర్ మెంట్ విభాగం జనరల్ మేనేజర్ వ్యవహరిస్తారు. వైసీపీ హయాంలో ఈ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా భూమన, చెవిరెడ్డి కొనసాగారు. నెయ్యి కొనుగోలుకు సంబంధించి ఈ కమిటీ కొన్ని నిబంధనలను ఏర్పాటు చేసింది. ఏదేని ఎంపిక చేసిన డెయిరీని రెండేళ్లపాటు ఎంప్యానల్ చేయాలని ఈ కమిటీ పక్కాగా చెబుతోంది.
అయితే ఈ కమిటీ సమావేశాన్ని ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో ఏర్పాటు చేసిన భూమన, చెవిరెడ్డిలు.. కమిటీ కన్వీనర్ లేకుండానే కొనసాగించారు. అసలు కమిటీ సమావేశాన్ని కమిటీ కన్వీనర్ కు సమాచారం ఇవ్వకుండా… కమిటీలో ఉన్న సభ్యుల్లో ఒక్కరిని మాత్రమే పిలిచి…మిగిలిన కమిటీ సభ్యులనూ పిలవకుండానే సమావేశాన్ని వారు కొనసాగించారు. వ్యూహాత్మకంగా జరిగిన ఈ సమావేశంలో డెయిరీల ఎంప్యానల్ ను ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతోనే కల్తీ నెయ్యి సరఫరా చేసే కంపెనీలు టీటీడీ టెండర్లలో పాలుపంచుకుని ఎంచక్కా టెండర్లను దక్కించుకున్నాయి.
ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేశ్ కుమార్ నేతృత్వంలో కమిషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్ కల్తీ నెయ్యి వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టింది. తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికలోనే చెవిరెడ్డి, భూమనల చేతివాటాన్ని కమిషన్ విస్పష్టంగా ప్రస్తావించింది.
కల్తీ నెయ్యి సరఫరా చేసే కంపెనీలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకే కొనుగోలు కమిటీ సమావేశాన్ని వారిద్దరూ అత్యంత రహస్యంగా నిర్వహించారని, డెయిరీల ఎంప్యానల్ ను పట్టించుకోకుండా టెండర్లకు ప్రకటన ఇచ్చేలా వారు యంత్రాంగాన్ని నడిపారని కమిషన్ తేల్చిచెప్పింది. కమిషన్ నివేదిక అందిన నేపథ్యంలో వారిద్దరిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందోనన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
This post was last modified on May 3, 2026 10:19 am
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలని పెద్దలు అంటారు. పెళ్లి, పిల్లలు ఏదైనా సరే ఏజ్ బార్…
సినిమా కుటుంబాల నుంచి వారసులు ఇండస్ట్రీలోకి రావడం చాలా మామూలు విషయం. ఐతే ఒక కుటుంబంలో తండ్రి హీరోగా, తల్లి…
గత ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను పనిచేశాను. స్థానిక ఎన్నికలు మీ భవిష్యత్తు. మీ అవసరాల కోసం. అందుకే…
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…