నాయకులు పద్ధతిగా వ్యవహరించాలని.. మర్యాదగా మెలగాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పదే పదే ఎమ్మెల్యేలు, వారి అనుచరులకు కూడా చెబుతున్నారు. అయినప్పటికీ.. చాలా మంది నాయకులు తమకు తోచిన విధంగానే వ్యవహరిస్తున్నారు. తమకు నచ్చినట్టే చేస్తున్నారు. దీంతో అటు తాము వివాదాల్లో చిక్కుకోవడంతోపాటు.. ఇటు పార్టీని ప్రభుత్వాన్ని కూడా వివాదాల్లోకి లాగుతున్నారు. ఇటీవల శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్.. టోల్ గేట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీనిపై స్పందించిన చంద్రబాబు వివాదాల జోలికి వెళ్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు.
అయితే.. ఆయన మాట విన్నారో లేదో.. తెలియదు కానీ.. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు హైవేపై వీరంగం వేశారు. హైవే టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేసి.. విచక్షణా రహితంగా కొట్టారు. నియోజకవర్గం పరిధిలోని వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద రుసుము కోసం సిబ్బంది కారును ఆపారు. అయితే.. ఎమ్మెల్యే అనుచరులు వెంటనే కారు దిగి.. మహిళ సిబ్బంది, మేనేజర్ రవి పై దాడికి పాల్పడ్డారు.
మహిళలు అని చూడకుండా మహిళా సిబ్బంది జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ వెళ్లారు. మరొకరు బండ బూతులు తిడుతూ.. కాలితో తంతూ.. సిబ్బందిపై వీరత్వం ప్రదర్శించారు. “ మేము అధికారంలో ఉండే ఎమ్మెల్యే బండి ని ఆపుతారా“ అంటూ దూషణల పర్వం కొనసాగించారు. అక్కడ పనిచేసే శ్రీలత, మేనేజర్ రవిపై దాడికి పాల్పడ్డారు. రవిని తీవ్రంగా కొట్టడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం అతని కాలర్ పట్టుకుని లాక్కుంటూ తీసుకువెళ్లి కార్ లో ఎక్కించుకున్నారు. దీంతో ఇతర సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కాగా.. ఈ ఘటన శనివారం ఉదయం జరిగినట్టు రికార్డు పరంగా తెలుస్తోంది.
అనేక వివాదాలు..
అమిలినేని సురేంద్రబాబు గత ఎన్నికల్లో తొలిసారి విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆయన చుట్టూ అనేక వివాదాలు తిరుగుతున్నాయి. నియోజకవర్గంలో భూ మాఫియాను పెంచి పోషిస్తున్నారని.. ఇదే నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత ఇటీవల పార్టీకి బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశం అయింది. ప్రజలకు సన్నిహితంగా ఉండాలని పార్టీ అధినేత చెబుతున్నారు. కానీ, సురేంద్ర బాబు మాత్రం తన వ్యాపారాలు.. రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో తీరిక లేకుండా ఉన్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం జరిగిన ఘటన సమయంలో ఆయన కారులో కూర్చుని వీక్షించినట్టు సిబ్బంది తెలిపారు.
This post was last modified on April 25, 2026 11:18 pm
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. మంగళవారం సాయంత్రం విజయవాడలో పర్యటించేందుకు వచ్చారు. తొలుత కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించుకున్న ఆయన.. అనంతరం..…
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…