దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రజలను ఉద్దేశించి తన మనసులోని భావాలను పంచుకునేందుకు ఎంచుకున్న కార్యక్రమమే.. మన్
కీ బాత్. తన (ప్రధానిగా) మనసులోని భావాలను ప్రజలకు వివరించే ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. 2015లో ప్రారంభించిన ఈ మన్ కీ బాత్‌కు ఆదిలో మంచి గుర్తింపు, ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రజలు.. కర్షకులు.. ప్రధాని తమకోసం ఏం చెబుతారో.. అని ఆసక్తిగా ఎదురు చూసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు(మోడీ రెండో సారి పీఎం అయ్యాక) కూడా మన్ కీ బాత్ ప్రసారం అవుతూనే ఉంది.
తాజాగా ఈ ఏడాదికి(2020) సంబంధించిన చివరి మన్ కీ బాత్ కార్యక్రమం ముగిసింది. అయితే.. గతంలో జరిగిన మన్ కీ బాత్‌కి.. ఇప్పుడు జరిగిన దానికి మధ్య చాలా వ్యత్యాసం వుంది. గడిచిన 27 రోజులుగా దేశవ్యాప్తంగా రైతాంగం నూతన వ్యవసాయ చట్టాలపై రోడ్డెక్కి భీకరమైన చలిని తట్టుకుని మరీ ఉద్యమం చేస్తోంది. సదరు చట్టాలను రద్దు చేయాలని ఘోషిస్తోంది. అయితే..ఈ ఉద్యమాన్ని ఏదో ఒకరకంగా పక్కదారి పట్టించేందుకు.. రైతుల మధ్య విభేదాలు తీసుకువచ్చి.. విడగొట్టి రాజకీయం చేసేందుకు మోడీ సర్కారు చేయని ప్రయత్నం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో మేధావుల నుంచి సామాన్యుల వరకు అందరూ రైతులకు అండగా నిలిచారు.
అదేసమయంలో కరోనా వ్యాక్సిన్ విషయంలో పిల్లి మొగ్గలు వేస్తున్న ప్రభుత్వంపై .. ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎప్పుడు జనబాహుళ్యంలోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొన్న వ్యాక్సిన్.. అదిగో ఇదిగో.. అటూ.. మోడీ సర్కారు కాల యాపన చేస్తోంది. దీంతో ఈ రెండు విషయాలపైనా ప్రధాని తన మనసులో ఏముందో చెబుతారని.. అందరూ ఎదురు చూశారు. అయితే. ఆయన దీనికి భిన్నంగా.. వ్యవహరించారు. ఈ క్రమంలో .. జన్ కీ బాత్ సునో.. మోదీ జీ!!
అంటూ.. యూట్యూబ్ సహా పలు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన మన్ కీ బాత్ వీడియోల కింద కామెంట్లను కుమ్మరించారు. గతంలో లైకులు జోరుగా వచ్చిన మన్ కీబాత్‌కు ఇప్పుడు డిజ్‌లైకులు ప్రవాహంగా వచ్చాయి. దీంతో ప్రధాని మన్‌కీ బాత్ ఫెయిలైపోయింది.
అయితే.. జన్ మన్‌కీ బాత్ వినిపించుకునేందుకు ఇష్టపడలేదేమో.. సదరు సోషల్ మీడియాలో కేవలం లైకులు మాత్రమే కనిపించేలా వ్యవస్థలో మార్పులు కేవలం గంట వ్యవధిలోనే జరిగిపోవడం గమనార్హం. సో.. దీనిని బట్టి.. జన్ మన్‌కీ బాత్ వినేందుకు మోడీ భయపడుతున్నారే! అనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on December 28, 2020 6:08 pm
అసలు ఓజి ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు కానీ అప్పుడే ఓజి 2 గురించి ప్రచారాలు ఊపందుకున్నాయి. ఎన్నికల ముందు వరకు…
ఏపీలో విపక్షం వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలుగా మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, నంద్యాల జిల్లాకు…
నిర్మాతగా నాని విపరీతమైన నమ్మకం పెట్టుకున్న కోర్ట్ ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఇంతకు ముందు ప్రొడ్యూసర్ గా…
వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగానే బుక్ అయిపోతున్నారు. వైసీపీ జమానాలో ఆయా నేతలు సాగించిన…
ఏపీ రాజధాని అమరావతి విషయంలో ప్రతిపక్షం వైసీపీ నాయకులు సృష్టిస్తున్న విషప్రచారాన్ని ప్రజలు నమ్మరాదని ఏపీ మంత్రులు కోరారు. రాజధాని…
సాధారణంగా ఒక రాజకీయ పార్టీ విఫలమైతే.. ఆ పార్టీ నష్టపోవడమే కాదు.. ప్రత్యర్థి పార్టీలు కూడా బలోపేతం అవుతాయి. ఇప్పుడు…