Political News

80% రాజ‌కీయ నేత‌లు సెక్స్ వీడియోలు చూస్తారా?,

“రాజ‌కీయ నేత‌లు.. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసేది త‌క్కువ‌.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ‌. కావాలంటే.. నా ఫోన్ స‌హా.. రాష్ట్రంలోని ప్ర‌జా ప్ర‌తినిధులు అంద‌రి ఫోన్లూ చెక్ చేసుకోండి.“ అని బీహార్‌కు చెందిన వివాదాస్ప‌ద ఎంపీ.. రాజేష్ రంజన్ అలియాస్ ప‌ప్పు యాద‌వ్‌.. మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. 80% నాయ‌కుల పోన్ల‌లో పెద్ద ఎత్తున సెక్స్ , పోర్న్ వీడియోలు ఉన్నాయ‌ని.. వీరిలో మ‌హిళా నాయ‌కులు కూడా ఉన్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఈ ఒక్క వివాదంతోనే ఆయ‌న స‌రిపుచ్చ‌లేదు. బీహార్ మ‌హిళా క‌మిష‌న్ స‌భ్యురాలు.. స‌జల‌పైనా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. “స‌జ‌ల ప‌విత్ర‌మైందా? నాకు నోటీసులు ఇవ్వ‌డానికి?. ఆమె ఎవ‌రెవ‌రితో ఉందో.. నా ద‌గ్గ‌ర ఫొటోలు ఉన్నాయి. వాటిని బ‌య‌ట పెట్టాలా? “ అని ప‌ప్పు యాద‌వ్ హెచ్చ‌రించారు. అంతేకాదు.. దేశ‌వ్యాప్తంగా 755 మంది నాయ‌కుల‌పై లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయ‌ని తెలిపారు. వీరంతా రాముళ్ల‌యితే.. ఇన్ని కేసులు ఎలా న‌మోద‌య్యాయ‌ని నిల‌దీశారు.

అస‌లు ఏం జ‌రిగింది?

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుపై మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడిన‌ప‌ప్పు యాద‌వ్‌.. మ‌హిళ‌ల‌కు రాజకీయంగా కెరీర్ ఉండాలంటే.. ఎవ‌రో ఒక‌రి గ‌దిలోకి వెళ్లాల్సిందేన‌ని తీర్మానించారు. ఈవ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయ‌న‌కు మ‌హిళా క‌మిష‌న్ నోటీసులు ఇచ్చింది. మ‌రో వైపు కొంద‌రు నాయ‌కులు కూడా ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేశారు. ఈ క్ర‌మంలో బుధ‌వారం మ‌రోసారి మీడియా ముందుకు వ‌చ్చిన ప‌ప్పు.. తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థించుకున్నారు.

పైగా తాను మ‌హిళా ప‌క్షపాతిన‌ని.. వారికి మేలు జ‌ర‌గాల‌నే కోరుకుంటున్నాన‌ని అన్నారు. కొస‌మెరుపు ఏంటంటే.. పాల‌ల్లో వెన్న పైకి క‌నిపించ‌న‌ట్టే.. త‌న వ్యాఖ్య‌ల్లో మంచి కూడా పైకి కనిపించ‌డం లేద‌న్నారు. దీనిని సూక్ష్మంగా గ్ర‌హిస్తే అర్థ‌మ‌వుతుంద‌ని వ్యాఖ్యానించారు. కాగా.. బీజేపీ స‌హా.. ఆర్డేజీ, బీజేడీల ప‌రోక్ష మ‌ద్ద‌తు ఉన్న ప‌ప్పు.. పూర్నియా నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

This post was last modified on April 23, 2026 10:56 am

Share

Recent Posts

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

17 minutes ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

8 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

8 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

9 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

9 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

10 hours ago