Political News

కూటమి నాయకులు అలా నేతలేమో ఇలా

ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి. పార్టీ అధినేతలు పొత్తు ధర్మం అనుసరించి నడుచుకుంటూ ఉంటే… నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి నేతలు మాత్రం తమ తమ మాటలు నెగ్గలేదంటూ ఒకరిపై మరొకరు విరుచకుపడిపోతున్నారు.

ఈ తరహా ఘటనలతో పార్టీ అధినేతలు తలలు పట్టుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా టీడీపీ, జనసేనల మధ్య ఇలాంటి ఘటనలే కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మంగళవారం రెండు చోటుచేసుకున్నాయి.

కాకినాడ జిల్లాలో జరిగిన ఘటన విషయానికి వస్తే… జనసేన అధినే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో టీడీపీ, జనసేన నేతల మధ్య వాదులాట, తోపులాట చోటుచేసుకుంది. పిఠాపురంలోని పాడా కార్యాలయంలో మంగళవారం జరిగిన పీఎంజేఏవై కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫొటో కనిపించలేదు. దీంతో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీ, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ అదేంటని నిలదీశారు.

ఈ సందర్భంగా జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాటు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా జనసేనకే చెందిన మరో కీలక నేత పెండెం దొరబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. వర్మపైకి ఆయన దూసుకుని వచ్చారు. దీంతో ఇరు పార్టీలకు చెందిన కేడర్ పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకుంటూ సాగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని గ్రహించిన స్థానిక పోలీసులు ఇరు వర్గాల కేడర్ ను అక్కడి నుంచి పంపించివేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.

ఇక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసిమ జిల్లా పి.గన్నవరంలో టీడీపీ, జనసేన వర్గాల మధ్య వాదులాట చోటుచేసుకుంది. డ్వాక్రా మహిళలకు సెల్ ఫోన్ల పంపిణీ కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, జనసేన నేత గిడ్డి సత్యనారాయణ హాజరయ్యారు.

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జనసేనాని పవన్ కల్యాణ్  ఫొటో కనిపించలేదట. దీంతో పవన్ ఫొటో లేదేమిటని ప్రశ్నించిన జనసైనికులు… పవన్ ఫొటో లేని ఫ్లెక్సీని తీసివేయాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో టీడీపీ కేడర్ వారితో వాదులాటకు దిగారు. ఎమ్మెల్యే వారించినా ఇరు వర్గాల వారు ఏమాత్రం వినకపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయక తప్పలేదు.

This post was last modified on April 21, 2026 3:57 pm

Share

Recent Posts

మాయమైన దేవుళ్ళ కోసం ‘హైందవ’ వేట

ఒక గుడిని ఆధారంగా చేసుకుని అల్లుకున్న సినిమాలు కొత్తేమీ కాదు. కార్తికేయ నుంచి మహేంద్రగిరి వారాహి దాకా ఈ మధ్య…

2 hours ago

ఈడీ విచారణకు అవినాష్ రెడ్డి… ట్రంకు పెట్లలో పత్రాలు

వంద‌లు కాదు.. ఏకంగా కొన్ని వేల పేజీల‌కు పైగా బ్యాంకు ఖాతా లావాదేవీల వివ‌రాల‌తో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి…

4 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా

దివంగత కాపు నేత వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా జనసేనలో చేరబోతున్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోన్న…

4 hours ago

ప్రభాస్ ట్రీట్ ఇస్తే ఇలానే ఉంటుంది

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌తో కొత్తగా ఎవరు కలిసి పని చేసినా.. తన గురించి సోషల్ మీడియాలో తప్పనిసరిగా…

6 hours ago

ఏపీలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఈ రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలోని…

8 hours ago

తీహార్ జైలుకు బొద్దింకలు

కాక్రోచ్ జనతా పార్టీ కీలక నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను ఢిల్లీ కోర్టు 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ…

8 hours ago