Movie News

కల్ట్ సీక్వెల్… ఈసారి సెటప్ అక్కడ

థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి ఏమైంది’ ఆ కోవకు చెందిన చిత్రమే. ‘పెళ్ళిచూపులు’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన తరుణ్ భాస్కర్.. ఆ తర్వాత రూపొందించిన చిత్రమిది.

ఐతే పాజిటివ్ టాకే వచ్చినప్పటికీ.. సినిమా పెద్దగా ఆడలేదు. కానీ తర్వాత టీవీల్లో, ఓటీటీలో ఈ సినిమాను విరగబడి చూశారు. మూడేళ్ల ముందు రీ రిలీజ్ చేస్తే.. ఫస్ట్ రిలీజ్ కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ఈ కల్ట్ మూవీకి తరుణ్ భాస్కర్ సీక్వెల్ తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదలైనపుడే దీనికి బంపర్ క్రేజ్ కనిపించింది సోషల్ మీడియాలో.

ఐతే అనుకున్న దాని కంటే ఈ సినిమా కొంచెం ఆలస్యం అవుతోంది. తరుణ్ భాస్కర్ నటుడిగా కూడా సినిమాలు చేస్తుండడం.. ‘ఈ నగరానికి ఏమైంది-2’ మీద ఉన్న భారీ అంచనాలను అందుకునేలా జాగ్రత్తగా ఈ సినిమాను చెక్కుతుండడమే ఈ ఆలస్యానికి కారణం. కాబట్టే ఈ ఏడాది చివరికి కానీ సినిమా రిలీజయ్యేలా కనిపించడం లేదు.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ థాయ్‌లాండ్‌లో జరుగుతుండడం విశేషం. మామూలుగా షూట్ ఎక్కడ జరుగుతోంది అన్నది పెద్ద విశేషం ఏమీ కాదు. కానీ ‘ఈ నగరానికి ఏమైంది-2’ షూట్ థాయ్‌లాండ్‌లో జరగడం విశేషమే. ఎందుకంటే కథ పరంగా ఈ విషయానికి ప్రాధాన్యం ఉంది.

‘ఈ నగరానికి ఏమైంది’లో ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా రాత్రి మందు కొట్టి సడెన్‌గా గోవాకు వెళ్లిపోతుంది. అక్కడ చేతిలో పడే పాట్ల నేపథ్యంలో కథ క్రేజీగా నడుస్తుంది. ‘ఈ నగరానికి ఏమైంది-2’ రేంజ్ మారుతోంది కాబట్టి.. ఈసారి ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా చిల్ కావడానికి థాయ్‌లాండ్ వెళ్తుందన్నమాట.

ఇంతకుముదు స్టేట్ బార్డర్ దాటిన ఫ్రెండ్స్.. ఈసారి కంట్రీ దాటి ఏం అల్లరి చేస్తారన్నది ఆసక్తికరం. సెటప్ థాయ్‌లాండ్‌కు మారడం వల్ల సినిమా గ్రాండియర్ పెరగడం ఖాయం. అదే స్థాయిలో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటే.. సినిమా పెద్ద రేంజికి వెళ్లడం ఖాయం. ఫస్ట్ పార్ట్‌లో ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ఉన్న విశ్వక్సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను తమ పాత్రల్లో కొనసాగనుండగా.. సుశాంత్ రెడ్డి స్థానంలోకి ‘హిట్’ ఫేమ్ శ్రీనాథ్ మాగంటి వచ్చాడు.

This post was last modified on April 21, 2026 3:51 pm

Share

Recent Posts

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

15 minutes ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

21 minutes ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

36 minutes ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

1 hour ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

4 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

5 hours ago