టీడీపీ రాష్ట్ర, జాతీయ కమిటీలను తాజాగా ప్రకటించారు. వీటిలో మెజారిటీ పదవులను యువతకు కేటా యించారు. దీనినే పార్టీలో కొందరు `లోకేష్ టీం`గా పేర్కొంటున్నారు. వీరంతా కూడా లోకేష్‌తో అనుబంధం ఉన్నవారే కావడం గమనార్హం. మంచిదే.. పార్టీలో అధినేత మొదలు ఎవరో ఒకరితో అనుబంధం ఉండడం తప్పుకాదు. కానీ.. తాజాగా ఎంపికైన పదవులను గమనిస్తే.. కీలకంగా ఉన్న యువ నాయకులకు భారీ బరువు బాధ్యతలే కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా 3 రూపాల్లో ప్రస్తుతం ఏర్పడిన యువ నాయకత్వానికి బాధ్యతలు పెరగనున్నాయని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. 1) వచ్చే ఎన్నికల్లో పార్టీని మరోసారి విజయ తీరాలకు చేర్చడం: దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ తరఫున సరైన ప్రణాళికను ఇచ్చేశారు. ప్రజలతో మమేకం కావడం.. ప్రజల సమ్యలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించడం కీలకం.
2) యువతను పార్టీవైపు ఆకర్షించడం: ప్రస్తుతం యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తున్న పార్టీలో మరింత మంది యువతకు ప్రాధాన్యం పెంచనున్నారు. ఈ బాధ్యతలను కొత్త కమిటీలే తీసుకుంటాయి. అంతేకాదు.. హుషారుగా కూడా పనిచేయనున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి బూత్ స్థాయి నుంచి అన్ని స్థాయిల్లోనూ యువతకు ప్రాధాన్యం పెరగనుంది.
3) కలివిడి: పార్టీలో ప్రస్తుతం యువ నాయకులకు-సీనియర్లకు మధ్య కలివిడి లోపించింది. దీనిని సరిదిద్దేందుకు ప్రస్తుతం ఏర్పడిన కమిటీలు కృషి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా సలహాలు.. సూచనలు వంటి విషయాలతో పాటు నియోజకవర్గాల్లో పర్యటనలు వంటివి కూడా యువ నాయకత్వమే చూసుకోవాలి. మొత్తంగా రాష్ట్రంలో యువతను కేంద్రంగా చేసుకుని ఈ కమిటీలు పార్టీని డెవలప్ చేయడంతో పాటు.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాల్సిన అతి పెద్ద బాధ్యతను పెట్టారు.
This post was last modified on April 18, 2026 8:11 am
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…