Political News

కేంద్రంలోని విపక్షాలపై జగన్ ఫైర్

లోక్ సభలో ఒక చారిత్రాత్మక బిల్లుపై ఓటింగ్ జరిగింది. అనూహ్యంగా ఎన్డీఏ ఓటింగ్ లో ఓటమి ఫాలయింది. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులపై దేశవ్యాప్తంగా చర్చలు కొనసాగుతున్న వేళ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఎక్స్ వేదికగా స్పందించిన జగన్, ఈ రెండు బిల్లులను వ్యతిరేకించిన పార్టీలు తమ నిర్ణయాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నదని, అదే సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వాయిదా పడటంతో మహిళలకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.

2026 జనగణన ఆధారంగా భవిష్యత్తులో సీట్ల కేటాయింపు జరిగితే దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా వృద్ధి తక్కువగా ఉండటంతో, సీట్ల వాటాలో తగ్గుదల వచ్చే ప్రమాదం ఉందని ఆయన సూచించారు.

ఇదిలా ఉండగా, జగన్ వ్యాఖ్యలపై వైసీపీ వర్గాలు మరింత వివరణ ఇచ్చాయి. 2011 జనగణన ఆధారంగా ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకు లభించే సీట్ల సంఖ్య భవిష్యత్తులో అలాగే ఉండకపోవచ్చని పేర్కొన్నాయి.

ఒకవేళ ప్రస్తుత బిల్లు ఆమోదం పొందకుండా ఆలస్యమైతే, 2026 జనగణన ఆధారంగా వచ్చే పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల వాటా మరింత తగ్గే అవకాశం ఉందని వివరించాయి. ప్రస్తుతం 38 సీట్ల వరకు లభించే అవకాశమున్న వాటా కూడా భవిష్యత్తులో తగ్గిపోవచ్చని వైసీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

.

This post was last modified on April 17, 2026 10:49 pm

Share

Recent Posts

డీలిమిటేషన్ బిల్లు లేన‌ట్టేనా?

దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభించి .. మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వం ఆశ‌లు ప్ర‌స్తుత స‌మావేశాల్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం…

1 hour ago

అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ప్రేమ్ కహాని

తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…

2 hours ago

అల్లు అర్జున్ 23… అప్పుడే ఇన్ని ప్రచారాలా

ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…

2 hours ago

మరో రెండు ఎయిమ్స్ ఆసుపత్రుల కోసం జనసేన వినతి

రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…

3 hours ago

దర్శన్ కేసులో కీలక మలుపు

కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…

3 hours ago

ఆగస్ట్ 7… ఓటిటిలో కంటెంట్ వర్షం

థియేటర్లలో రేపు నాలుగైదు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేకంగా ఓటిటిలో వచ్చే కొత్త కంటెంట్ కోసం ఎదురు…

4 hours ago