దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలను పునర్విభజించే డీలిమిటేషన్, అదేసమయంలో మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే 2023నాటి నారీ శక్తివందన చట్టానికి సవరణల బిల్లు.. గురువారం పార్లమెంటుకు చేరింది. దీనిపై సభలో చర్చను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్‌రిజుజు ప్రారంభించారు. అనంతరం.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా దీనిపై ప్రసంగించారు. ఆ తర్వాత.. ఇతర పార్టీల సభ్యులు మాట్లాడారు.
అందరిలోనూ ఒకే భయం!
పార్లమెంటులో చర్చ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు అందరూ.. ఒక్కొక్క అంశాన్ని ప్రస్తావించినప్పటికీ.. అందరిలోనూ ఒకే భయం ఏర్పడింది. డీలిమిటేషన్‌కు-మహిళా రిజర్వేషన్ చట్టం సవరణకు లింకు పెట్టడం!. రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో పోలిక పెట్టి.. లింకు పెట్టి.. రాష్ట్రాలకు అన్యాయం చేయడంపై మెజారటీ ప్రతి పక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ సభ్యులు ఎక్కువగా దీనిపై స్పందించారు.
నియోజకవర్గాల పునర్విభజన అనేది జనాభా ప్రాతిపదికన చేయాల్సిందేనని పట్టుబట్టారు. రిజర్వేషన్ ప్రక్రియను దీనికి లింకు పెట్టేందుకు వీల్లేదని సభ్యులు వాదనలు వినిపించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్టీల సభ్యులు డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాయి. ఇక, ఉత్తర ప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాజ్ వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. ముస్లింమైనారిటీ మహిళలకు రిజర్వేషన్‌లో ఎంత కోటా ఇస్తున్నారని ప్రశ్నించారు. అదేసమయంలో ఈబీసీలు, ఓబీసీలు, బీసీలకు కోటా ఎలా విభజిస్తారని నిలదీశారు.
దీనిపై కేంద్ర మంత్రి అమిత్ షా స్పందిస్తూ.. “ప్రస్తుత బిల్లులలో మహిళలు అంటే.. మహిళలు. వారు ఏ సామాజిక వర్గాలకు చెందిన వారనే విషయం అప్రస్తుతం. దేశంలో కుల గణన జరిగిన తర్వాత.. దానిని నిర్ణయించే అవకాశం ఉంది.
మీకు(ఎస్పీ) మొత్తం సీట్లను ముస్లింలకు ఇవ్వాలని ఉంటే.. మేం అభ్యంతరం చెప్పడం లేదు.“ అని వ్యాఖ్యానించారు. దీంతో ఎస్పీ నేత యాదవ్ విభేదించారు. తాము మూడు బిల్లులకు(రిజర్వేషన్+ డీలిమిటేషన్+ పార్లమెంటులో సీట్ల పెంపు) వ్యతిరేకమని స్పష్టం చేశారు. మొత్తంగా ఈ బిల్లులపై ప్రతిపక్షాలు ఒకే తరహా ఆందోళన లేవనెత్తడంతో ప్రభుత్వ పక్షం డిఫెన్స్‌లో పడింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
